UP Viral Video: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కుర్రాళ్లు డేంజరస్ స్టంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రీల్స్ కోసం ప్రయత్నిస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయినా, పద్దతి మార్చుకోవడం లేదు. తాజాగా యూపీలో ఓ యువకుడు ఏకంగా కదులుతున్న స్కార్పియోపై ప్రమాదకర స్టంట్లు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వాహనదారుడికి భారీగా జరిమానా విధించడంతో పాటు కేసు అతడిని అరెస్ట్ చేశాడు.
నెట్టింట వైరల్ అయిన వీడియో
తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ రహదారి మీద ఓ యువకుడు స్టంట్లు చేశాడు. బ్లాక్ స్కార్పియోను రోడ్డు మీదికి తీసుకొచ్చి ఫస్ట్ లోడ్ గేర్ లో ఉంచి నెమ్మదిగా ముందుకు కదిలేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నెమ్మదిగా కుడివైపు డోర్ ఓపెన్ చేసి, సదరు యువకుడు డ్రైవర్ సీట్ లో నుంచి నెమ్మదిగా బొన్నెట్ మీదికి ఎక్కాడు. చేతులు చాపుతూ ఫోజులు ఇచ్చాడు. అంతేకాదు, కారు మీద కూర్చొని మరికొన్ని ఫోజులు ఇచ్చాడు. చివరగా కారు మీదికి ఎక్కి నిల్చున్నాడు. ఈ తతంగాన్ని అంతా మరో వాహనంలో వచ్చే తన ఫ్రెండ్స్ షూట్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన రాజేష్ సాహు అనే జర్నలిస్ట్ “UP ట్రాఫిక్ పోలీసుల దాదాపు రూ. 50 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా, ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారి లైసెన్స్ ను రద్దు చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి” అని రాసుకొచ్చాడు.
हापुड़-हाईवे पर रईसजादे का जानलेवा स्टंट, चलती कार का स्टेरिंग छोड़कर किया स्टंट
युवक का वीडियो सोशल मीडिया पर वायरल, हापुड़ के हाईवे 9 का बताया जा रहा मामला#Hapur @hapurpolice @Uppolice pic.twitter.com/yo3mHnAEhY
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 23, 2025
రూ. 30,500 జరిమానా, జైలు శిక్ష
అటు ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. వెహికల్ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన సదరు యువకుడికి రూ. 30,500 జరిమానా విధించారు. అతడిని అరెస్ట్ చేసి లాకప్ లోపడేశారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. “హాపూర్ జిల్లాలో ఒక వ్యక్తి స్టీరింగ్ వదిలి కదులుతున్న స్కార్పియో కారు బానెట్ ఎక్కి స్టంట్లు, రీల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే ఆ ప్రాంత పోలీసులు స్కార్పియో డ్రైవర్ ను, కారుతో పాటు, అదుపులోకి తీసుకున్నారు. MV చట్టం కింద చర్య తీసుకున్నారు. రూ.30,500/- చలాన్ జారీ చేశారు. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటారు” అని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి పనులు చేసిన వారి వీపు విమానం మోత మోగిస్తే, ఇతరులు కూడా ఇలాంటి పనులు చేయడానికి భయపడుతారు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “అతడి డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
#अपडेटः– जनपद हापुड़ में चलती स्कोर्पियो कार का स्टेरिंग छोड़कर बोनट पर चढ़कर स्टंटबाजी व रील बनाने का वीडियो सोशल मीडिया पर वायरल हुआ था, जिसका #HapurPolice द्वारा तत्काल संज्ञान लेते हुए स्कॉर्पियो कार चालक को मय कार सहित हिरासत में लेकर एमवी एक्ट के अन्तर्गत कार्यवाही कर उक्त… pic.twitter.com/bDWP6pcTw5
— HAPUR POLICE (@hapurpolice) August 24, 2025
Read Also: పిల్లలకు టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్త సాహసం, నెట్టింట వీడియో వైరల్!