OTT Movie : హాలోవీన్ సీజన్ మొదలైంది. ఈ సమయాన్ని వెన్నులో వణుకు పుట్టించే సినిమాలతో పండుగ చేసుకోండి. ఆత్మలు, రిచ్యువల్ వంటి థీమ్స్ తో ఓటీటీలో ఆడియన్స్ ని కొన్ని సినిమాలు బెదరగొడుతున్నాయి. వీటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తుంది. ఈ కథ ఒక యాంకర్ లైవ్ లో హారర్ స్టోరీలను గురించి డిస్కస్ చేస్తుంటాడు. ఆ సమయంలో ఒక డెమన్ అందరికీ చుక్కలు చూపిస్తుంది. సూపర్ నాచురల్ హారర్ స్టోరీలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘లేట్ నైట్ విత్ ది డెవిల్’ (Late Night With The Devil) 2023లో విడుదలైన ఒక అమెరికన్ సూపర్ నాచురల్ హారర్ సినిమా. దీనిని కోలిన్, కామెరాన్ కైర్న్స్ దర్శకత్వం వహించగా, ఇందులో డేవిడ్ దస్త్‌మల్చియాన్, లారా గోర్డాన్, ఇయాన్ బ్లిస్, ఫైసల్ బాజ్జీ, ఇంగ్రిడ్ టోరెల్లి, రైస్ ఔటెరి, జార్జినా హేగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 మార్చి 10 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు వచ్చింది. థియేటర్లలో 2024 మార్చి 22న రిలీజ్ అయింది. ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ఉన్న ఈ సినిమా, ప్రస్తుతం Prime Video, Shudder, lionsgate play అందుబాటులో ఉంది.
1977 అక్టోబర్ 31 హాలోవీన్ రాత్రి సమయంలో చికాగోలోని ఒక టీవీ స్టూడియోలో “నైట్ ఔల్స్” అనే టాక్ షో లైవ్ టెలికాస్ట్ మొదలవుతుంది. జాక్ అనే వ్యక్తి దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తుంటాడు. గత కొన్ని నెలలుగా ఈ చానెల్ కి రేటింగ్స్ పడిపోయాయి. ఆయన భార్య మేడిలిన్ కూడా ఇటీవల క్యాన్సర్‌తో చనిపోయింది. జాక్ చాలా డిప్రెషన్లో ఉంటాడు. తన భర్యకు సరైన టైమ్ ఇవ్వలేదని గిల్టీగా ఫీల్ అవుతాడు. రేటింగ్స్ బూస్ట్ కోసం హాలోవీన్ స్పెషల్ షో కి ప్లాన్ చేస్తాడు. ఈ షో విశేషం ఏమిటంటే సూపర్ నాచురల్ శక్తులు, ఆత్మల గురించి లైవ్ లో మాట్లాడుతాడు. వాటి మీద జోక్స్ కూడా వేస్తుంటాడు. మరో వైపు మైల్స్ అనే ఒక అమ్మాయిలో డెమన్ ఉందని పుకార్లు వస్తాయి. దీంతో జాక్ ఆ అమ్మాయిని షో కి తీసుకొస్తాడు.
Read Also : థియేటర్లలో అట్టర్ ప్లాప్…. ఓటీటీలో తుక్కురేగ్గొడుతున్న ధనుష్ మూవీ… ఇంకా చూడలేదా ?
షో మొదట జాక్ జోక్స్ తో సరదాగా నడుస్తుంది. ఆ తరువాత మైల్స్ కళ్లు తెల్లగా మారతాయి. భయంకర స్వరంలో డెమన్ మాట్లాడుతుంది. స్టూడియో లైట్స్ ఫ్లికర్ అవుతూ, సౌండ్స్ విచిత్రంగా వస్తాయి. ఆడియన్స్ కూడా భయపడతారు. కానీ జాక్ ఇదొక ఫేక్ ట్రిక్ అని కవర్ చేస్తాడు. కానీ డెమన్ నేను నరకం నుండి వచ్చానని గట్టిగా అరుస్తుంది. స్టూడియోలో హాలుసినేషన్స్ మొదలవుతాయి. అయినా జాక్ షో కంటిన్యూ చేయమంటాడు. రేటింగ్స్ సూపర్ గా వస్తుంది. కానీ డెమన్ మైల్స్ శరీరం నుండి బయటకు వచ్చి స్టూడియోలో ఉన్నవాళ్లను పాసెస్ చేస్తుంది. అక్కడ ఒక్కొక్కరూ చనిపోతూ పరిస్థితి భయంకరంగా మారుతుంది. ఈ పరిస్థితి నుంచి జాక్ బయట పడతాడా ? ఇంతకీ డెమన్ ఎక్కడి నుంచి వచ్చింది ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ సూపర్ నాచురల్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.