Korean Romantic Drama on OTT: ఆఫీసులో 9 నుండి 6 వరకు టార్గెట్లు, ప్రెజర్ మాత్రమే కాదు.. ఊహించని ప్రేమకథలు కూడా పుడుతుంటాయి. అందులోనూ కెరీర్‌నే తన ప్రాణంగా భావించే ఒక స్ట్రిక్ట్ మేనేజర్ జీవితంలోకి, ఒకేసారి ఇద్దరు వ్యక్తులు వస్తే ఆ ఆఫీసు వాతావరణం ఎంత రసవత్తరంగా మారుతుందో ఊహించుకోండి. ‘క్వీన్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ’గా పేరుగాంచిన కొరియన్ స్టార్ హీరోయిన్ పార్క్ మిన్-యంగ్ (Park Min-young) మళ్లీ తన ఫేవరెట్ ఆఫీస్ రొమాన్స్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘వాట్స్ రాంగ్ విత్ సెక్రటరీ కిమ్’, ‘మ్యారీ మై హస్బెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత ఆమె నటించిన సరికొత్త ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా ‘నైన్ టు సిక్స్’ (Nine to Six) నేటి నుంచే డిజిటల్ గా సందడి చేస్తోంది. ‘గోబ్లిన్’ ఫేమ్ యూక్ సుంగ్-జే (Yook Sung-jae), సీనియర్ హ్యాండ్సమ్ హీరో గో సూ (Go Soo) కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్, పాపులర్ చైనీస్ డ్రామా ‘ది రేషనల్ లైఫ్’కు కొరియన్ రీమేక్‌గా తెరకెక్కింది. ఆఫీసు రాజకీయాల మధ్య జూనియర్, సీనియర్ల తో సాగే ఆ క్రేజీ ప్రేమ పంచాయతీ ఏంటో, ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ సిరీస్ కథంతా ‘క్రానిక్ మోటార్స్’ (Chronic Motors) అనే ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీలోని లీగల్ టీమ్ సీనియర్ మేనేజర్ కాంగ్ యి-జీ (పార్క్ మిన్-యంగ్) చుట్టూ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. కెరీర్‌నే తన ప్రపంచంగా భావించే యి-జీ, ప్రేమ, పెళ్లి అనేవి కేవలం హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే ఆకర్షణలు మాత్రమేనని బలంగా నమ్ముతుంది. తన పనేదో చూసుకుంటూ, క్రమశిక్షణతో ఉండే ఆమె జీవితంలోకి అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడంతో ఆమె ప్రశాంతమైన జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది.
ఒకవైపు తన టీమ్‌లో కొత్తగా చేరిన జూనియర్ ఇంటర్న్ హాన్ సన్-వూ (యూక్ సుంగ్-జే) తన నిజాయితీ, సున్నితమైన మనస్తత్వంతో యి-జీకి దగ్గరవుతాడు. నిజానికి జ్యువెలరీ డిజైనింగ్ అంటే ప్రాణమిచ్చే సన్-వూ, ఆఫీసులో యి-జీకి ఆపద వచ్చిన ప్రతిసారీ అండగా నిలుస్తూ ఆమె ఆలోచనా విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు యూరప్ హెడ్‌క్వార్టర్స్ నుంచి బదిలీపై వచ్చిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్క్ హ్యూన్-టే (గో సూ), యి-జీ ప్రతిభను మెచ్చుకుంటూ ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటాడు. ఆఫీసు రాజకీయాల మధ్య జూనియర్‌తో పెరుగుతున్న పరిచయం, సీనియర్ బాస్ చూపిస్తున్న ఆదరణ మధ్య చిక్కుకున్న యి-జీ చివరికి తన కెరీర్‌ను ఎంచుకుందా? ఇద్దరిలో ఎవరి ప్రేమను ఎంచుకుంది ? అనేది ఎంతో వినోదాత్మకంగా, ఆకట్టుకునేలా చూపించారు.
రొమాంటిక్ డ్రామా ‘నైన్ టు సిక్స్’ (Nine to Six) నేటి నుంచే (2026 నవంబర్ 25) నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ప్రతి బుధవారం, గురువారం కొత్త ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఒరిజినల్ కొరియన్ (Korean) ఆడియోతో పాటు ఇంగ్లీష్ (English) సబ్‌టైటిల్స్ సదుపాయంతో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, ఆఫీస్ రొమాన్స్, కె-డ్రామా అభిమానులకు ఒక పర్ఫెక్ట్ ట్రీట్.
Read Also: టిఫిన్ డెలివరీ బాయ్ నుండి వైరల్ యూట్యూబర్ వరకు… చూస్తే ఒక్క ఎపిసోడ్ కూడా వదలరు