Delhi Assault Case: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రీత్ విహార్ ప్రాంతంలో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. సహోద్యోగులే ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
బాధిత యువతి ప్రీత్ విహార్‌లోని ‘సల్తనత్ కేఫ్’ (Saltanate Cafe)లో పనిచేస్తోంది. నిందితులు కూడా అదే కేఫ్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ఆ కేఫ్‌లో సహోద్యోగులంతా కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి 11:30 గంటలకు కేఫ్ క్లోజ్ చేసిన తర్వాత బృందంలోని వారంతా లోపలే ఉన్నారు.
మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు వారంతా మద్యం సేవిస్తూ నృత్యాలు చేస్తూ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీ జరుగుతున్న సమయంలోనే తనపై ఇద్దరు తోటి మగ ఉద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ దారుణానికి మిగిలిన వారు కూడా సహకరించారని ఆమె ఆరోపించింది.
Also Read: దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు..ఫారెన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో, తారాజువ్వలా సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు
బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇద్దరు మహిళలతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: రెండున్నర దశాబ్దాల తర్వాత.. Gold Spot రీఎంట్రీ, కాంపా టార్గెట్‌గా అడుగులు