Kingdom: గౌతం తిన్న నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదలైనప్పుడు నుంచి నిర్మాత నాగ వంశీ ఈ సినిమా గురించి భారీ ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. ఈ సినిమాకి ఎటువంటి రివ్యూలు వచ్చినా కూడా తాను స్వాగతిస్తాను అని మాట్లాడారు.
ఈ కథను గౌతమ్ నాగవంశీ దగ్గరకు తీసుకు వచ్చినప్పుడే రెండు పార్టులుగా ఉంది. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ చూసినా కూడా ప్రాపర్ స్టార్టింగ్ మరియు ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది అని పలు సందర్భాలలో తెలిపాడు. ఈ సినిమా జులై 31న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇతరుణంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
కాపీ డైలాగులు
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ తిరుపతిలో జరిగింది. అయితే విజయ్ స్టేజ్ పైన మాట్లాడుతూ పుష్ప సినిమా డైలాగులను గుర్తు చేశాడు. కేవలం స్టేజి మీద మాత్రమే పుష్ప డైలాగులు చెప్పాడు అనుకుంటే, ట్రైలర్ లో ఇంకా అనిమల్ సినిమా డైలాగులు వినిపించాయి. ఒక సందర్భంలో మీ మీద ఈగ వాలిన మొత్తం ఢిల్లీ తగలబెట్టేస్తా అని అంటాడు రన్బీర్ కపూర్ తన తండ్రితో అనిమల్ సినిమాలో. ఇక్కడ మా అన్నను ఏమైనా అంటే మొత్తం తగలబెట్టేస్తా అని విజయ్ హీరోహిన్ తో మాట్లాడుతాడు. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈవెంట్ లోనే కాకుండా సినిమాలో కూడా కాపీ డైలాగులు పెట్టేసారా అంటూ కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
భారీ అంచనాలు
ఈ సినిమా జులై 31న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద అయితే మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కొంతమేరకు బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలకపాత్ర వహించింది. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండకు అన్నగా నటిస్తున్నాడు. ఈ సినిమా పాటలు కూడా కొంతమేరకు బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: Shruti Haasan : తమిళ్ లో నన్ను ట్రోల్ చేశారు, నాగ్ అశ్విన్ నన్ను మార్చారు