E-Paper
Advertisement

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!
Advertisement

Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు పట్టభద్రులు బుద్దిచెప్పాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్ ఎగిరిపోయిందని.. పొలం కాడ ఫ్యూజ్ ఎగిరిపోతే రైతులు కొత్త ఫ్యూజ్ వేసినట్టు కొత్తదైన తమ పార్టీ అభ్యర్థులకు రైతన్నలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు, నిద్రావస్థలో ఉన్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను విద్యావంతులు అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రాడ్యుయేట్లంతా కచ్చితంగా ఓటరుగా ఎన్ రోల్ చేసుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కవిత కోరారు. తమ పార్టీ అభ్యర్థులు పొలిటికల్ గా ఫైనాన్షియల్ గా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని.. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం మాత్రం ఉందన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా తాము ఇద్దరు బీసీలకే అవకాశం కల్పించామన్నారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీల మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో అధికారపార్టీకి, నిద్రలోఉన్న విపక్షాలకు బుద్దిచెప్పేందుకు అవకాశం ఉందన్నారు.

Advertisement

ఎన్నికల సంఘం వద్ద టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా నమోదైందని కవిత స్పష్టం చేశారు. పార్టీపై అభ్యంతరాలు, సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు కూడా డబ్బులు తీసుకుని ఓటు వేస్తారన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. రెండు వందల కోట్లు ఖర్చు పెట్టయినా సరే తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకుంటారనే అపవాదు తొలగించుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల మంది ఏదో ఒక డిగ్రీ ఉన్న వాళ్లేనని, వారంతా కూడా ఆలోచించి ఓటు వేయాలన్నారు.

Also Read: వందే భారత్ స్లీపర్ vs రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఛార్జీలు, వేగం, సౌకర్యాల్లో దేనిది పైచేయి?

Advertisement

శాసన మండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం లేని పరిస్థితి నెలకొందని.. బీఆర్ఎస్ సభ్యులు సగానికి పైగా కాంగ్రెస్ లో చేరిపోయారని కవిత గుర్తు చేశారు. బీజేపీ సభ్యులు కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని తెలిపారు. మండలిలో ప్రతిపక్షం అవసరముందని.. ప్రజల కోసం గొంతెత్తే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతిపక్షంగా గ్రాడ్యుయేట్ల తరపున పోరాటం చేస్తామన్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలంగాణలోని మూడో వంతు ప్రాంతంలో ఎన్నికల వాతావారణం ఉందని చెప్పారు. దాదాపు 75 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామన్నారు.

Also Read: జియో రూ. 1,748 vs రూ. 1,799 ప్లాన్లు.. బెనిఫిట్స్ పరంగా దేని దమ్ము ఎంత? ఏది రీఛార్జ్ చేస్తే బెటర్?

Tags

Related News

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

ఆ 558 మంది భవిష్యత్తు ఏమిటి? డీఎంఈ నిర్ణయంతో రోడ్డున పడ్డ వైద్య సిబ్బంది!

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. బాధిత కుటుంబానికి అండగా బిగ్ టీవీ చైర్మన్!

రాహుల్‌ను పీఎం మెటీరియల్ చేసేందుకే ఇదంతా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ రామచందర్ రావు!

Big Stories

Advertisement
×