Samantha Twin Babies: టాలీవుడ్ సినీనటి సమంత త్వరలోనే తల్లిగా ప్రమోట్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈమె గత ఏడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును(Raj Nidimoru) వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన కొద్ది నెలలకే ఈమె తల్లి కాబోతోందనే శుభవార్తను అభిమానులకు తెలియజేశారు. ప్రస్తుతం సమంత(Samantha) తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి తెలిసినదే. మరి కొద్ది రోజులలో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా సమంత డెలివరీ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈమె తన బేబీ బంప్ (Baby Bump)కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఇక సమంత ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో ఈమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తూ తనకు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా సమంత హాస్పిటల్ లో కవల పిల్లలకు జన్మనిచ్చారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు నిజమేననుకొని ఒక బామ్మ సమంతకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. నా ఫోన్లో ఆమె పిల్లల ఫోటోలు కూడా వస్తున్నాయి అంటూ చాలా అమాయకంగా మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. వారి కుటుంబ సభ్యులు సమంతకు ఇంకా డెలివరీ కాలేదని ఆమె కుటుంబ సభ్యులు బేబీ బంప్ ఫోటో చూపించారు అయితే ఆ అమ్మమ్మ లేదు నా ఫోన్లో ఉన్నదే నిజం, ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు అంటూ వాదించారు.
ఇక తమ అమ్మమ్మ డౌట్ తీరాలి అంటే కచ్చితంగా ఈ వీడియో పై సమంత మేడం స్పందించి మా అమ్మమ్మ కు క్లారిటీ ఇవ్వండి అంటూ వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సమంత కంటికి కనపడటంతో ఆమె రిప్లై ఇచ్చారు. ఇలా తనకు కవల పిల్లలు పుట్టారంటూ అమాయకంగా చెబుతున్నటువంటి ఆ అమ్మమ్మ వీడియో పై సమంత స్పందిస్తూ.. ఇంకా లేదు అమ్మమ్మ అంటూ చాలా క్యూట్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా సమంత కవల పిల్లలు పుట్టారంటూ వస్తున్న పుకార్లపై ఇంకా లేదని సమాధానం చెప్పడంతో ఈమెకు నిజంగానే కవలలు పుట్టబోతున్నారా? అంటూ కొత్త సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
?vrfl=MWlxdTZyZjlnem81Yg%3D%3D
సమంత కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సమంత ఎక్కడా స్పందించలేదు కానీ తాజాగా ఒక అమ్మమ్మ కవలలు పుట్టారంటూ వైరల్ అవుతున్న వీడియో పై ఇంకా లేదని సమంత రిప్లై ఇవ్వడంతో.. అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తూ అంటే త్వరలో కవలలు పుట్టబోతున్నారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే సమంతకు కవలలు పుట్టబోతున్నారా? లేదా అనేది మరి కొద్ది రోజులలో తెలియనుంది. ఇక సమంతకు పుట్టబోయే బిడ్డకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ పేరు పెట్టండి అంటూ కొన్ని పేర్లను కూడా సూచిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ రిలీజ్ డేట్ లాక్… ప్రేక్షకులకు కిక్ ఇచ్చేనా?