E-Paper
Advertisement

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Advertisement

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: ప్రపంచ ఆర్థిక, పెట్టుబడుల విధానాలపై చర్చలకు దావోస్ అంతర్జాతీయ వేదికగా గుర్తింపు పొందినట్లే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే భారత్ సమ్మిట్ 2026తో రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై ప్రపంచానికి దిశానిర్దేశం చేసే అంతర్జాతీయ వేదికగా హైదరాబాద్ ఎదగనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు హైదరాబాద్‌లో నవంబర్ 13,14 తేదీల్లో భారత్ సమ్మిట్-2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి, ప్రపంచానికి నూతన దిశానిర్దేశం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తోందన్నారు.హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో భారత్ సమ్మిట్-2 విజయవంతం చేయడానికి నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 70కిపైగా దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికే తమ అంగీకారం తెలిపారని వెల్లడించారు.

ప్రపంచానికి గాంధీ, నెహ్రూ విధానాలు అవసరం

Advertisement

‎మహాత్మా గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతం, తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలు భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా నేటి పరిస్థితుల్లో ఎంతో అవసరమని పేర్కొన్నారు. కొన్ని అగ్రరాజ్యాలకు అనుగుణంగా వ్యవహరించే క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్వతంత్ర గుర్తింపును, అస్తిత్వాన్ని కోల్పోకూడదన్నదే నెహ్రూ ఆలోచన అని చెప్పారు.భారతదేశం స్వశక్తితో ఎదగడమే కాకుండా ప్రపంచంలోని ప్రగతిశీల,అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాయకత్వం వహించాలన్న ఆయన దూరదృష్టి దేశానికి బలమైన పునాదులు వేసిందన్నారు. పంచవర్ష ప్రణాళికలు, ఇతర ఆర్థిక విధానాలు దేశాన్ని బలోపేతం చేశాయని, నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు రావడంలో నెహ్రూ విధానాల పాత్ర కీలకమని వివరించారు.
‎
‎ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి మరో కీలక స్తంభం

‎పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉన్నట్లే ప్రతిపక్షం కూడా ఉండాలని, ఈ రెండూ ప్రజాస్వామ్య వ్యవస్థకు రెండు కీలక స్తంభాలని స్పష్టం చేశారు.అధికారంలో ఉన్నవారు ప్రతిపక్ష పార్టీలను, నాయకులను శత్రువులుగా చూడకూడదని, కేవలం తమతో విభేదించే రాజకీయ ప్రత్యర్థులుగానే భావించాలని సూచించారు. ప్రతిపక్షాల ఆలోచనలు, విధానాలను వ్యతిరేకించవచ్చే తప్ప, వారిని శత్రువులుగా పరిగణించడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతిపక్ష పార్టీలను శత్రువులుగా చూస్తున్నారని, వాటిని, వాటి నాయకత్వాన్ని రాజకీయంగా అంతం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికార, ప్రతిపక్షాలు రెండూ సమర్థవంతంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను బలంగా విశ్వసిస్తుందని, ఈ అంశాలపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను భారత్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం అత్యంత ప్రాథమికమైన రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. ఓటు హక్కు ద్వారానే ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం పొందుతారని చెప్పారు. అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు.

Advertisement

Also Read: మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

Tags

Related News

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

ఆ 558 మంది భవిష్యత్తు ఏమిటి? డీఎంఈ నిర్ణయంతో రోడ్డున పడ్డ వైద్య సిబ్బంది!

Big Stories

Advertisement
×