E-Paper
Advertisement

త్రివిక్రమ్‌కు బ్యాడ్ టైమ్ మొదలైందా..‘గాడ్ ఆఫ్ వార్’ లో అంతా కన్ఫ్యూజనే!

త్రివిక్రమ్‌కు బ్యాడ్ టైమ్ మొదలైందా..‘గాడ్ ఆఫ్ వార్’ లో అంతా కన్ఫ్యూజనే!
Advertisement

Trivikram NTR God of War:త్రివిక్రమ్ శ్రీనివాస్..తన పెన్ పవర్ తో ఎంతో మందిని నవ్వుల వర్షంలో ముంచేసి సాలిడ్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ టాలీవుడ్ గురూజికి ఇపుడు టైమ్ అంతగా కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తుంది.విషయంలోకి వెళ్తే గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో అచ్చొచ్చిన వెంకీ మామతో ఆదర్శ కుటుంబం అని మెదలెట్టాడు.

కానీ ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో ఇపుడు పరిస్థితులు ఒక్క సారిగా రివర్స్ అయ్యాయన్న టాక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.అవును తారక్ తో తాను చేయబోయే గాడ్ ఆఫ్ వార్ సినిమా అనుకున్నట్టుగానే నిర్మిస్తానన్న హాసిని హారిక క్రియేషన్స్ నిర్మించాలా లేదా అన్న డైలమాలో పడిందని ఇబ్బడి ముబ్బడిగా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

గత కొంతకాలంగా త్రివిక్రమ్ తన సినిమాలన్నీ వరుసగా హాసిని హారిక క్రియేషన్స్ లోనే నిర్మిస్తున్నాడు.దాంతో హాసిని హారిక క్రియేషన్స్ పేరు వినిపిస్తే ముందుగా త్రివిక్రమే గుర్తుకు వచ్చేవాడు.ఇక వీరి కాంబోలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ లాంటి సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా .

అయితే గత రెండు సినిమాలైన గుంటూరు కారం ,అలాగే వెంకీమామ హీరోగా వచ్చిన ఆదర్శ కుటుంబం అనుకున్నంతగా ఆడకపోవడంతో గురూజీ – తారక్ ల కాంబోలో వచ్చే గాడ్ ఆఫ్ వార్ సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ పెడితే ఎంతవరకు సేఫ్ అంటూ లెక్కలు వేసే పనిలో పడ్డారని ఇన్ సైడ్ టాక్.

Advertisement

నిజానికి ఒకప్పటి త్రివిక్రమ్ వేరు ఇప్పటి త్రివిక్రమ్ వేరని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఖలేజా వంటి థియేట్రికల్ డిజాస్టర్ సినిమాకి కూడా టీవీలో, యూట్యూబ్ లో ఎంత క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పుకోనక్కర్లేదు.ముఖ్యంగా ఖలేజా సినిమా రీ రిలీజ్ లో రికార్డులు కొల్లగొట్టడం కూడా మనం చూశాం.అలాంటి గురూజీ ఒక సాదా సీదా దర్శకుడిలా సినిమాలు తీసుకపోవడం ఆడియన్స్ కి అందునా ఆయన అభిమానులకి అసలే మాత్రం రుచించడం లేదు కూడా.

దీంతో ఆయన పని అయిపోయిందని, ఇక తారక్ సినిమాకి కూడా అంత భారీ బడ్జెట్ లు పెట్టేవారు దొరకడం కష్టమని, పెడతామన్న హారిక హసిని క్రియేషన్స్ కూడా హ్యాండ్ ఇవ్వడం పక్కా అని కొందరు అంటూ ఉంటే, అబ్బే అదేమీ లేదని, మళ్ళీ సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడం పక్కా అని ,ఇక తారక్ తో తీసే గాడ్ ఆఫ్ వార్ ఇండస్ట్రీ రికార్డులని తుడిచిపెట్టడం ఖాయం అంటూ సపోర్ట్ చేస్తున్నారు గురూజీ ఫ్యాన్స్. చూడాలి మరి వైరల్ అవుతున్న వార్తలని నిజం చేస్తూ చిన బాబు చల్లగా సైడ్ అవుతాడా లేక త్రివిక్రమ్ మీద కాన్ఫిడెన్స్ తో అలాగే ముందుకు సాగుతాడా చూడాలి !

ALSO READ :రాను బొంబాయి నుంచి నిమ్మతోట వనంలో వరకు.. సింగర్ ప్రభ టాప్ సాంగ్స్ ఇవే !

Tags

Related News

కవల పిల్లలు పుట్టారంటూ రూమర్స్.. క్యూట్ రిప్లై ఇచ్చిన సమంత!

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ రిలీజ్ డేట్ లాక్… ప్రేక్షకులకు కిక్ ఇచ్చేనా?

విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావ సభ.. ప్రత్యేక ఆకర్షణగా నందమూరి కోడలు?

లంగా ఓణిలో ట్రెడిషనల్ లుక్ తో మెరిసిపోతున్న నిహారిక..ఏకి పారేస్తున్న ఫ్యాన్స్!

మూడు ఇండస్ట్రీలు.. ముగ్గురు డైరెక్టర్లు.. సూర్య రేంజే వేరు!

విజయ్ దేవరకొండను రెండో పెళ్లి చేసుకుంటా.. బాంబ్ పేల్చిన నటి?

పారడైజ్‌లో బాబుమోహన్‌కు అవమానం? గెటప్ టెస్ట్ చేసి పక్కన పెట్టేశారా?

Big Stories

Advertisement
×