BigTV English

Sonu Sood: ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ భారీ సాయం… ఎన్ని లక్షలు ఇచ్చాడంటే?

Sonu Sood: ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ భారీ సాయం… ఎన్ని లక్షలు ఇచ్చాడంటే?

Sonu Sood: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కొన్ని రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. చాలా రోజులపాటు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ఓడిపోయారు ఫిష్ వెంకట్. అయితే ఫిష్ వెంకట్ హాస్పిటల్లో ఉన్న తరుణంలో కొంతమంది సినిమా ప్రముఖులు వెళ్లి కలిశారు.


అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉండేవారు. ఇక ఫిష్ వెంకట్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ ను ఆదుకుంటున్నారు సోనూసూద్. సోను సూద్ తన కుటుంబానికి చేసిన సాయాన్ని పంచుకున్నారు ఫిష్ వెంకట్ కుమార్తె.

సోను సూద్ భారీ సాయం


ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటానని సోనూసూద్ భరోసా ఇచ్చారని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. తన తండ్రి దశదిన కర్మకు రూ.1.5లక్షలు ఇచ్చారని, అందువల్లే గ్రాండ్ గా కార్యక్రమం జరిగిందని చెప్పారు. తమ ఇంటి నిర్మాణ బాధ్యతను తాను చూసుకుంటానని సోనూసూద్ చెప్పారన్నారు. ఇటీవల చనిపోయిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్, వెంకట్ తనకు సోదరుడిలాంటి వారని చెప్పారు. ఆ కుటుంబానికి పర్సనల్ నంబర్ ఇచ్చారు.

రియల్ లైఫ్ హీరో 

సోను సూద్ సినిమాల్లో విలన్ పాత్రలో నటిస్తాడు అనే సంగతి తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ గా కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఇప్పుడు రియల్ లైఫ్ లో చాలామందికి ఉపయోగపడి తనకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని సాధించుకుంటున్నాడు. సోనూసూద్ సాయం గురించి ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ముఖ్యంగా కరోనా టైంలో సోను సూద్ కార్మికుల కోసం నిలబడిన పని తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

చాలామంది హీరోలు కూడా చేయలేని పనులను సోను సూద్ చేశారు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చి వ్యక్తి సోను సూద్. కేవలం ట్విట్టర్లో ఒక పోస్ట్ చూసి కూడా అతను రెస్పాండ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం చేసి మరోసారి తన మంచితనాన్ని ప్రూవ్ చేశారు.

Also Read: Ghaati Trailer : ఘాటితో స్వీటీ వచ్చేస్తుంది, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×