Soubin shahir: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వివిధ మార్గాలలో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇంకొంతమంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు…ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఒక ఖరీదైన కార్ ను కొనుగోలు చేయగా… ఇప్పుడు మరో నటుడు దాదాపు రూ.3కోట్లకు పైగా ఖర్చుపెట్టి ఖరీదైన కార్ ను సొంతం చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు సౌబిన్ షాహిర్ (Soubin shahir). మలయాళ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఇటీవల కూలీ (Coolie ) సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ‘మోనికా’ అనే స్పెషల్ సాంగులో పూజా హెగ్డే (Pooja Hegde) తో కలసి ఆమెతో పోటీపడి మరీ స్టెప్పులు వేశారు. అలా తన డాన్స్ తో కూడా అందరిని ఆకట్టుకున్న ఈయన సినిమా విడుదలయ్యాక తన నటనతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఖరీదైన కారు కొనుగోలు చేసిన సౌబిన్ షాహిర్..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సౌబిన్ షాహిర్.. ఇప్పుడు ఒక ఖరీదైన కార్ ను కొనుగోలు చేశారు. బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కార్ ను కొనుగోలు చేశారు. ఈ కారు విలువ మార్కెట్ ప్రకారం రూ.3.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇకపోతే సౌబిన్ ఈ కారు కొనుగోలు చేసిన తర్వాత భార్య, కొడుకుతో షికారుకు వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం కూలీ సినిమాతో బాగానే ముట్టినట్టున్నాయి ఆ సినిమా జ్ఞాపకంగా ఇప్పుడు ఈ కారు కొనుగోలు చేశారా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
సౌబిన్ షాహిర్ కెరియర్..
మలయాళ నటుడిగా పేరు సొంతం చేసుకున్న సౌబిన్ షాహిద్ కేరళ ఫోర్ట్ కొచ్చిలో పుట్టి పెరిగారు. ఈయనకు ఒక సోదరుడు, సోదరి కూడా ఉన్నారు. ఈయన తండ్రి బాబు షాహిర్ అసిస్టెంట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేశారు.. ఇక ఈయన కెరియర్ విషయానికొస్తే.. సిద్ధిక్ క్రానిక్ బ్యాచిలర్ సినిమా ద్వారా సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈయన.. నటుడిగా తన కెరీర్ను మార్చుకోవడం జరిగింది. ఇక 2024లో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో సీజు డేవిడ్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టించింది. అంతేకాదు మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. పైగా ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి మలయాళ సినీ పరిశ్రమలో మొదటి చిత్రంగా నిలిచింది. అలా ఒకవైపు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా పేరు ప్రఖ్యాతలు గడించారు.
సౌబిన్ షాహిర్ వ్యక్తిగత జీవితం..
సౌబిన్ షాహిర్ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. 2017 డిసెంబర్ 16న జామియా జహీర్ ను వివాహం చేసుకున్నారు. ఈమె కొచ్చికి చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ కావడం గమనార్హం. వీరికి 2019లో ఒక కుమారుడు కూడా జన్మించారు.
ALSO READ:Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?