Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా సక్సెస్ అందుకున్న నాగార్జున(Nagarjuna) వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన కూలీ సినిమా (Coolie Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి నాగార్జున సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో క్యామియో పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బిగ్ బాస్ హోస్ట్ గా, హీరోగా కూడా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున మరొక హీరో జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా (Jayammu Nischayammuraa) అనే కార్యక్రమానికి అతిథిగా వచ్చారు..
హోటల్ కారిడార్ శుభ్రం చేసిన నాగార్జున..
తాజాగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగపతిబాబు ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలను ఆహ్వానించి ఎలాంటి దాపరికాలు లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జునకు సంబంధించిన ఒక విషయాన్ని కూడా బయటపెట్టారు. నాగార్జున జగపతిబాబు ఇద్దరు కలిసి ఓసారి సింగపూర్(Singapore) వెళ్లారని అక్కడ జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ఇలా ఇద్దరు కలిసి సింగపూర్ లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో స్టే చేశామని జగపతిబాబు తెలిపారు. ఇలా ఫైవ్ స్టార్ హోటల్లో కారిడార్ లో ఉన్న సమయంలో బాంబు పేల్చామని ఆ దుర్వాసన కారణంగా హోటల్ యాజమాన్యం నాగార్జున చేత కారిడార్ మొత్తం శుభ్రం చేయించారు అంటూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ఫర్నిచర్ షాప్ లో పనిచేసిన జగపతిబాబు…
జగపతిబాబు ఈ సంఘటన గురించి చెప్పడంతో వెంటనే నాగార్జున ఫోటోలు కూడా ఉన్నాయా అంటూ షాక్ అయ్యారు.. జగపతిబాబు ఈ విషయాన్ని బయట పెట్టడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగపతిబాబు సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం కూడా నాగార్జున అనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు జగపతిబాబు వైజాగ్ లో ఒక ఫర్నిచర్ దుకాణంలో పని చేస్తూ వీలైనప్పుడు సినిమా షూటింగ్స్ చూసేవారని తెలిపారు. కానీ నాగార్జున నటనకు ముగ్ధుడైన తాను కూడా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయం తీసుకొని ఇండస్ట్రీ వైపు అడుగులు వేశానని జగపతిబాబు తెలిపారు.
విలన్ పాత్రలలో మెప్పిస్తున్న జగపతిబాబు..
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజీ సమయంలో జరిగిన సంఘటనల గురించి అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇద్దరి సినిమాల గురించి ఎన్నో విషయాలను మాట్లాడుతూ.. ప్రేక్షకులకు తెలియని విషయాల గురించి కూడా అభిమానులకు తెలియజేశారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ హీరోగా కాకుండా విలన్ గా పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. హీరోగా తెలుగు సినిమాలు మాత్రమే చేసిన జగపతిబాబు విలన్ పాత్రలలో మాత్రం ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Bigg Boss Agnipariksha: నాలో స్వీట్ చాక్లెట్ బాయ్ నే చూశారు… భయపెడుతున్న అభిజిత్