TFCC Bharath Bhushan: సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ అయినా.. రాజకీయ రంగం అయినా పదవీకాలం పూర్తయింది అంటే కచ్చితంగా ఆ పదవి నుండి తప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పదవీ కాలాన్నే పొడిగించాలని చూస్తున్నారు TFCC ప్రెసిడెంట్ భరత్ భూషణ్ (Bharath Bhushan). అసలు విషయంలోకి వెళ్తే.. గత ఏడాది జూన్ 28న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగగా.. అందులో మొత్తం 48 మంది సభ్యులు పాల్గొని, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు(Dilraju ) పదవీ కాలం పూర్తవడంతో ఎన్నికలు జరిగాయి. గత ఏడాది జరిగిన ఎన్నికలలో భరత భూషణ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా అశోక్ (Ashok).ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఈ ఎన్నికలలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియో యజమానులు వంటి నాలుగు సెక్టార్స్ లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.
పదవీ కాలాన్ని పొడిగించాలని చూస్తున్న TFCC అధ్యక్షుడు..
ఇక ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా భరత భూషణ్ పదవీకాలం కూడా ఈ నెలాఖరులో ముగియనుండడంతో.. వచ్చేనెల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఈ పదవీ కాలాన్ని పొడిగించాలని భరత్ భూషణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
భరత్ భూషణ్ పై మండిపడ్డ ఈసీ..
ముఖ్యంగా TFCC రూల్స్ బ్రేక్ చేసి పదవీ కాలాన్ని పొడిగించడానికి అటు భరత్ భూషణ్ తో పాటు కోశాధికారి అశోక్ ప్రసన్న కూడా ఒత్తిడి తేవడంతో ఈసీ సమావేశం వీరిపై రగిలిపోయింది. దేవుడు సృష్టించిన విపత్తుల పరిస్థితుల్లో మాత్రమే ఛాంబర్ యొక్క ఉప చట్టాలు పొడిగింపును అనుమతిస్తాయి అని.. చరిత్రలో ఈ పొడిగింపు కేవలం రెండుసార్లు మాత్రమే జరిగింది అని.. కరోనా సమయంలో నారాయణ్ దాస్ నారంగ్ కి పొడిగింపు లభించగా.. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో ఎన్.వి.ప్రసాద్ లకి మాత్రమే ఇలా పొడిగింపు లభించింది. ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేయడం కుదరదు అంటూ స్పష్టం చేసింది.
2 నెలల పొడిగింపుకు స్రవంతి రవి కిషోర్ ఆమోదం..
అయితే భరత్ భూషణ్, అశోక్ ప్రసన్న మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సన్నిహితులు కావడంతో తాము చెప్పినట్లే జరుగుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారట.. అయితే దీనిపై స్రవంతి రవి కిషోర్ (Sravanthi Ravi Kishore) మాత్రం రెండు – మూడు నెలలు పొడిగింపుకు అంగీకరించినా.. భరత భూషణ్ మాత్రం పూర్తికాలిక పొడిగింపు కోసం ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు వెళ్లకుండానే పొడిగింపు కూడా లభిస్తుందని.. ముఖ్యంగా ఈసీ సభ్యులలో ఎక్కువ మందిని ఒప్పిస్తే.. పదవీ కాల పొడిగింపును ఆమోదించవచ్చు అని ఆయన ప్లాన్ చేస్తున్నారట.
హైకోర్టులోనే తేల్చుకుంటాం – స్రవంతి రవి కిషోర్
అయితే దీనిపై స్రవంతి రవి కిషోర్, కొల్లా అశోక్ కుమార్ తోపాటు మరికొంతమంది సభ్యులు ఈ పొడిగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.” దాదాపు 1650 మంది ఈసీ సభ్యులు ఈ విషయాన్ని ఆమోదించాలి. కానీ ఈసీ దీనిని ఆమోదించదు. భరత్ భూషణ్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎమ్మెల్యేలు తమకు మరో పదవీకాలం లభిస్తుందని తీర్మానం చేసినట్లుగా ఉంది. భరత భూషణ్ మరో పదవీ కాలం పొందాలి అని పట్టుబడితే మాత్రం.. హైకోర్టులోనే తేల్చుకుంటాము” అంటూ స్రవంతి రవి కిషోర్ స్పష్టం చేశారు. మరి హైకోర్టుకి వెళ్తానంటున్న రవి కిషోర్ కి అక్కడ హైకోర్టు ఎలాంటి తీర్మానం ఇస్తుందో చూడాలి.
భరత్ భూషణ్ ఆలోచనల వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా..?
ఇకపోతే భరత్ భూషణ్ మరో పదవీ కాలాన్ని ఆశించడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని కొంతమంది చెబుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. చిత్రపురిలో తాజాగా ప్లాన్ చేస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కారణంగానే పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారని పుకార్లు వ్యక్తమవుతున్నాయి. ఇంత ఖరీదైన ప్రాజెక్టు వస్తున్నప్పుడు అధికారంలో ఉండడం అనేది చాలా కీలకం. అందుకే భరత్ భూషణ్ ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని సమాచారం.
సమావేశానికి హాజరుకాని బడా నిర్మాతలు..
అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భరత భూషణ్ కోరిన ఈ విషయంపై ఈసీ సమావేశం నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి దిల్ రాజు, మైత్రి రవి, సురేష్ బాబు, ఠాగూర్ మధు, సునీల్ నారంగ్ వంటి బడా నిర్మాతలు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
also read:Pawan Kalyan: దీనస్థితిలో పాకీజా.. స్పందించి విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్!