ENG vs IND: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్ రేపటినుండి బర్మింగ్ హమ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యం. కీలక సమయాలలో కీలక క్యాచ్ లు నేలపాలు చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దాదాపు 6 సార్లు మన వాళ్ళు లైఫ్ ఇచ్చారు. అందుకు బదులుగా ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించుకున్నారు.
Also Read: Shivam Dube: CSK డేంజర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం… ఏకంగా 27.5 కోట్లతో
ఇలా తొలి టెస్ట్ మ్యాచ్ లో ఫీల్డర్ల తప్పిదాలను గమనిస్తే.. ప్రధాన ధోషిగా యువ ఆటగాడు యశస్వి జైష్వాల్ పేరు చెప్పవచ్చు. ఎందుకంటే ఆరింటిలో నాలుగు క్యాచ్ లు అతడే నేలపాలు చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ ఫీల్డింగ్ తీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తొలి టెస్ట్ అనంతరం అతడికి గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫీల్డింగ్ విషయం డిమోట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రెండవ టెస్ట్ మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్ స్లిప్స్ ఫీల్డింగ్ లో జైస్వాల్ కనిపించలేదు.
ఫలితంగా యశస్వి జైష్వాల్ రెండవ టెస్ట్ మ్యాచ్ లో స్లిప్స్ లో ఫీల్డింగ్ చేయడు. గిల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మాత్రమే కనిపించారు. తాజాగా టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కాటే సోమవారం రోజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని దాదాపు ధ్రువీకరించాయి. ” జైష్వాల్ నీ స్లిప్ ఫీలింగ్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం నిజమే. భారత క్యాచింగ్ విభాగం మరింత దృఢంగా మారాలి.
ఇంగ్లాండ్ లో కనీసం నాలుగు ప్రధాన క్యాచర్లు ఒక్కోసారి కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. జైష్వాల్ కూడా మంచి క్యాచర్. కానీ అతడిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. జైష్వాల్ లో తిరిగి ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అతడు కొంతకాలం పాటు స్లిప్స్ లో ఫీల్డింగ్ చేయడు” అని స్పష్టం చేశాడు. ఇక జైస్వాల్ టెస్ట్ క్రికెట్ లో ఓ మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు.
సుదీర్ఘ ఫార్మాట్ లో భారత్ తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచే అవకాశానికి చేరువగా వచ్చాడు. ప్రస్తుతం ఆ రికార్డు రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరిద్దరూ ఈ ఫీట్ ని 40 ఇన్నింగ్స్ లలో సాధించారు. 1999లో న్యూజిలాండ్ పై రాహుల్ ద్రావిడ్, 2004లో ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్ ఈ రికార్డుని సొంతం చేసుకున్నారు. 2023 జూలైలో వెస్టిండీస్ తో తన టెస్ట్ అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్.. ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్ లలో 52.86 యావరేజ్ తో 193 పరుగులు చేశాడు. జైష్వాల్ మరో 97 పరుగులు సాధిస్తే రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుని అధిగమించే అవకాశం ఉంది.