Pawan Kalyan: 90లలో అద్భుతమైన నటనతో, కామెడీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి పాకీజా (Pakeezah )గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల చెన్నై నుంచి వచ్చి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఈమె.. అనంతరం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. తన బాధను చెప్పుకున్నారు. చిరంజీవి(Chiranjeevi ), నాగబాబు(Nagababu ), మోహన్ బాబు(Mohanbabu ) లాంటి తెలుగు హీరోలు తనను ఆదుకున్నారు అని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనను ఆదుకోవాలి అని, మీడియా ముందు తన గోడును వెళ్ళబుచ్చుకున్న విషయం తెలిసిందే.
పాకీజాకు ఆర్థిక సహాయం అందించిన పవన్ కళ్యాణ్..
ఇక ఈ విషయం విని చలించి పోయిన పవన్ కళ్యాణ్ ఆమెకు ఆప్త హస్తం అందించారు. ఆమె దీనస్థితి తెలుసుకొని ఆమెకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. మంగళగిరి లోని జనసేన కేంద్ర కార్యాలయంలో కొన్ని నిమిషాల క్రితం ఈ మొత్తాన్ని శాసనసభ మండలిలోని ప్రభుత్వ విప్ పి. హరి ప్రసాద్, పి.గన్నవరం, శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భావోద్వేగానికి లోనైన పాకీజా..
ఇక పవన్ కళ్యాణ్ చేసిన ఆర్థిక సహాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాను. తక్షణమే స్పందించి, తగిన విధంగా ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ పాకీజా తెలిపారు. ప్రస్తుతం పాకీజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
పాకీజా ఈ స్థితికి రావడానికి కారణం..
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఈ స్థితికి రావడానికి కారణం ఈమె భర్త, అత్తమామలు. సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే అప్పటి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha ) పిలుపుమేరకు తమిళ్ రాజకీయాల్లోకి వెళ్లిన ఈమె.. సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అక్కడే అన్నాడిఎంకె అధికార ప్రతినిధిగా చలామణి అయ్యింది. అదే సమయంలో రాజ్ కుమార్ (Raj Kumar) అనే వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే తమ పెళ్లి ఇష్టం లేని అత్తమామలు తనను అత్యంత దారుణంగా హింసించారని, భర్త మద్యానికి బానిస అవడంతో డబ్బు, బంగారం అంతా ఖర్చు చేశారని, భర్త మరణించిన తర్వాత అత్తమామలు ఇంటి నుండి గెంటేసారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును కూడా తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగించానని, ఇప్పుడు తన వద్ద తినడానికి కూడా తిండి కోసం అడుక్కునే పరిస్థితి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పాకీజా .
also read:Producer Sirish : మీరే రామ్ చరణ్‌ను వాడుకున్నారు… నిర్మాతను ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్!
Shri #PawanKalyan extends financial support to actress Smt. Vasuki (Pakeezah) 💐
Moved by her condition, Govt Whip #PiduguHariprasad & MLA #GiddiSatyanarayana handed over ₹2 Lakhs on his behalf.
A gesture of kindness that echoes his values 🙏#Janasena #PawanKalyanCharity pic.twitter.com/j1liawkHU5
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) July 1, 2025