E-Paper
Advertisement

ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, హింస రాజ్యం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి విమర్శలు

ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, హింస రాజ్యం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి విమర్శలు
Advertisement

Jeevan Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఆ పార్టీ ప్రకటించిన హామీలకు నేటితో మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు మాత్రమే మిగిలాయని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పత్రాలను ఆయన చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు.

సైబర్ మోసం, హింస రాజ్యం అంటూ విమర్శలు

Advertisement

ఎన్నికల సమయంలో 420 హామీలు, 11 డిక్లరేషన్లు అంటూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని జీవన్ రెడ్డి అన్నారు. అసలైన సైబర్ నేరగాళ్లు అంటే కాంగ్రెస్ పార్టీయేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది ఇందిరమ్మ రాజ్యం కాదని, హింస రాజ్యం కొనసాగుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని.. ఎవరికీ కనీస భరోసా లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.

కాళేశ్వరంపై ఆరోపణలు..

Advertisement

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని, రైతులు చనిపోతే కనీస బీమా కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లను బాంబులతో పేల్చి కుట్ర చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గెలిచి కూడా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరే..

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తారని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read: సమ్మక్క సాగర్‌కు ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో రేవంత్, ఉత్తమ్ భేటీ

Tags

Related News

సమ్మక్క సాగర్‌కు ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో రేవంత్, ఉత్తమ్ భేటీ

డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ దోపిడీ.. 72 ఏళ్ల వృద్ధురాలికి రూ.1.42 కోట్ల టోకరా

సోనియా గాంధీ గుండెల్లో నిజంగా తెలంగాణ లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

తాగునీటి ముసుగులో.. నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ స్కెచ్..?

పాన్ షాప్ ముసుగులో గంజాయి దందా.. 21 కిలోల సరుకుతో క్యారియర్ అరెస్ట్

మంచిర్యాలలో నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్!

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో మామూళ్ల మాఫియా.. అంతా ఆ ఇద్దరి చేతిలోనే..?

Big Stories

Advertisement
×