E-Paper
Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆకాశంలో ఒక తార.. రన్ టైం లాక్!

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆకాశంలో ఒక తార.. రన్ టైం లాక్!
Advertisement

Aakasamlo oka Tara movie:మాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salman).. సీతారామం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో నేరుగా తెలుగులో చిత్రాలు చేస్తూ ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్న ఈయన.. తాజాగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయగా.. ఒక సాధారణ అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనే తన కలను ఎలా నెరవేర్చుకుంది ? అనే కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చూపించారు . ఈ ఒక్క పాయింట్ సినిమాపై ఊహించని అంచనాలు పెంచేసింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆకాశంలో ఒక తార..

ఇకపోతే విడుదల తేదీకి కేవలం కొద్ది రోజులు మాత్రమే వున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. 2:39 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు 20వ తేదీన రాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సాత్విక వీరవల్లి..

Advertisement

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇందులో శృతిహాసన్ మరో కీలకపాత్రలో మెరువనుండగా.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్, స్వప్న సినిమాస్ తో పాటూ తదితర ప్రముఖ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

also read:త్రిగుణ్ చేతిలో వంశీ కీలుబొమ్మా? ఇచ్చిపడేసిన చైత్ర!

అభిమానుల అంచనాలను అందుకుంటుందా?

Advertisement

ఆకాశంలో ఒక తార ట్రైలర్ విషయానికి వస్తే.. ఏపీజే అబ్దుల్ కలాం మాటలే స్ఫూర్తిగా మార్చుకున్న ఒక పల్లెటూరి అమ్మాయి అన్ని సమస్యలను అధిగమించి అంతరిక్షానికి ఎలా చేరుకుంది? అనేది ఈ సినిమా కథ అన్నట్టుగా మనకు ట్రైలర్ లో చూపించారు. ఆ పల్లెటూరి అమ్మాయి ప్రయాణం ఎలా సాగింది? అందులో దుల్కర్ సల్మాన్ పాత్ర ఏంటి? గౌతమ్ మీనన్ , శృతిహాసన్ ల పాత్ర ఏంటి? తదితర విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా కూడా అభిమానుల అంచనాలను అధిగమించి అంతరిక్షాన్ని అందుకుంటుందా ? లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది. మరి దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. అటు ఈ సినిమా కథను నమ్ముకొని ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సాత్విక వీరవల్లికి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

అనిరుధ్‌పై ధనుష్ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకీ వివాదం?

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. భవిష్యత్తులో కూడా ఉంటుంది:రమ్య కృష్ణ

కెరూబ్’ ట్రైలర్ రిలీజ్.. రామాయణం అంత హిట్ అవుతుందా?

ఒకప్పుడు తాజ్ హోటల్లో పని చేసిన స్టార్ నటి ఎవరో తెలుసా?

ఎల్లమ్మ మూవీకి విలన్ దొరికేసినట్టేనా?

నైజాంలో కల్కి2 ధర ఎన్ని కోట్లో తెలుసా? ఎవరు దక్కించుకున్నారంటే?

తేజా సజ్జాకు కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? జాక్ పాట్ కొట్టాడుగా..

Big Stories

Advertisement
×