Sree Vishnu,Prabhas:ఈమధ్య ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) ని ఏ రేంజ్ లో వాడుతున్నారో చెప్పక్కర్లేదు.ఇక ఇదే టెక్నాలజీని వాడి అసభ్యకరమైన కంటెంట్ చేస్తున్నారు అంటూ జాన్వీ విషయంలో తారక్ మండిపడ్డ సంగతి తెల్సిందే.మొత్తానికి ఇలా సరికొత్త టెక్నాలజీని ఒక్కొకరు ఒక్కోలా వాడుకుంటూ ఉంటే మన కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ శ్రీ విష్ణు దానిని మరోలా వాడే పనిలో పడ్డాడు,అయితే అది మంచికే నండోయ్.
డార్లింగ్ ప్రభాస్ తో ఫోటో దిగినట్టు
తాజాగా శ్రీవిష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ ఈ అక్టోబర్ 9 న వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే,ఇక ప్రమోషన్స్ లో మూవీ టీమ్ వేగం పెంచింది కూడా.అందులో భాగంగా శ్రీవిష్ణు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ తో ఫోటో దిగినట్టు AI లో డిజైన్ చేయడం ఇపుడు అభిమానుల్లో చర్చకి దారి తీస్తుంది.అరె శ్రీవిష్ణు అన్న బలే ప్లాన్ చేశాడే అంటే ,డార్లింగ్ తో ఫోటో దిగావు గా ఇక నీ సినిమాకి తిరుగులేదంటూ మరికొంతమంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్
ఇక కామ్రేడ్ కళ్యాణ్ విషయానికి వస్తే శ్రీవిష్ణు ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలే ఉన్నాయి.నిజానికి సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానుల్లో క్యూరియాసిటీ పెరగడం సహజం. దీంతో ప్రభాస్‌తో కలిసి ఉన్నట్టుగా కనిపించిన ఈ ఫొటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఏఐ టూల్స్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో వీటి హవా మామూలుగా లేదు. సెలబ్రిటీలతో ఫొటోలు దిగినట్టుగా క్రియేట్ చేయడం దగ్గర నుంచి.. అసలు జరగని సంఘటనలను కూడా కళ్లముందు జరిగినట్టుగా చూపించే స్థాయికి ఏఐ టెక్నాలజీ వెళ్లిపోయింది. ఇదే సమయంలో కొందరు హీరోలు, వారి సినిమాలకు సంబంధించిన కంటెంట్ కూడా ఈ ఏఐ ట్రెండ్‌లో భాగంగా వైరల్ అవుతోంది. తాజాగా హీరో శ్రీవిష్ణుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీని కొందరు సరదా కోసం ఉపయోగిస్తుంటే.. మరికొందరు తమ అభిమాన హీరోల సినిమాలకు కొత్త రేంజ్‌లో బజ్ తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారు. శ్రీవిష్ణు విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇద్దరు హీరోల అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తూ తమదైన కామెంట్స్ చేస్తున్నారు.
మరోసారి వెరైటీ కథతో ప్రేక్షకుల ముందుకు
ఇక ‘కామ్రేడ్ కళ్యాణ్’ విషయానికి వస్తే.. శ్రీవిష్ణు మరోసారి వెరైటీ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది . ఇప్పటివరకు చేసిన సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న శ్రీ విష్ణు ఈసారి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇకఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ALSO READ :వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!
అక్టోబర్ 9న తేలిపోనుంది !
ఇప్పటికే పాటలు, టీజర్, ఈవెంట్లు, సోషల్ మీడియా ద్వారా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసే పనుల్లో ఉంది మూవీ టీమ్ .ఇలాంటి సమయంలో ప్రభాస్‌తో శ్రీవిష్ణు కలిసి ఉన్నట్టుగా కనిపించిన ఫొటో రావడం సినిమాకు మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.చూడాలి మరి డార్లింగ్ తో దిగిన ఫోటో ఏ మేరకి పనికొస్తుందో అక్టోబర్ 9న తేలిపోనుంది !
https://x.com/HailPrabhas007/status/2107390107288502594/video/1