E-Paper
Advertisement

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!
Advertisement

Actress Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఎప్పుడూ తన సంచలన పోస్టులతో సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా మారుతుంటారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఎవరి పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఆమె చేసే క్రిప్టిక్ కామెంట్లు ఎప్పుడూ పెద్ద దుమారమే రేపుతుంటాయి. తాజాగా ఆమె పెట్టిన కొన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి. అసలు పూనమ్ ఎవరిని టార్గెట్ చేశారు? ఆ పోస్టుల వెనుక అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

జీరో ఆదర్శం.. 100 శాతం పబ్లిసిటీ:

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పూనమ్ కౌర్ పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. “ఏమాత్రం ఆదర్శం లేని, వంద శాతం పబ్లిసిటీ చేసుకునే ఈ డైరెక్టర్ బారి నుంచి నటీనటులను, నిర్మాతలను దేవుడే కాపాడాలి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనీ ట్రాప్, మూఢనమ్మకాల ట్రాపింగ్‌తోనే ఇతను కాలం వెళ్లదీస్తుంటాడని ఆమె మండిపడ్డారు. ఈ తాంత్రికుడు, నకిలీ గురువు నుంచి అమాయకులను ఆ దేవుడే కాపాడాలని ఆమె ఘాటుగా విమర్శించారు.

‘అజ్ఞాతవాసి’ అంటూ మరో ట్విస్ట్:

Advertisement

ఇక ఆ పోస్టులతో ఆగకుండా పూనమ్ మరో సంచలన స్టోరీ పెట్టారు. “AK అనేది మరో నటుడి విషయంలో ‘అజ్ఞాతవాసి’ లాంటిది.. అంతే” అంటూ మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పోస్టులో వాడిన ‘ఆదర్శం’, ‘AK’, ‘గురువు’ వంటి పదాలు టాలీవుడ్‌లో ఇప్పడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఎవరి పేరు నేరుగా చెప్పకపోయినా, ఆమె ఎవరిని ఉద్దేశించి ఇవన్నీ రాశారో నెటిజన్లు ఇట్టే పసిగట్టేశారు.

త్రివిక్రమ్, వెంకీ సినిమానే టార్గెట్?:

పూనమ్ కౌర్ ఇన్‌డైరెక్ట్‌గా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో గట్టిగా చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం AK 47’ గురించే ఆమె ఈ కామెంట్లు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక గతంలోనూ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లను ఉద్దేశించి ఆమె పలుమార్లు వివాదాస్పద పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

మరోసారి వాయిదా పడిన సినిమా:

Advertisement

మరోవైపు వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం AK 47’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే త్వరలోనే అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలోకి రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవైపు సినిమా వాయిదాలు, మరోవైపు పూనమ్ కౌర్ వివాదాస్పద పోస్టులు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

also read: వరుణ్ సందేశ్, శ్వేత ‘నా వైఫ్ మిస్సింగ్’ టీజర్ రిలీజ్.. మెప్పించారా?

మొత్తానికి, పూనమ్ కౌర్ మరోసారి తన క్రిప్టిక్ పోస్టులతో టాలీవుడ్‌లో కలకలం రేపారు. ఎవరి పేర్లు రాయకుండానే ఆమె సంధించిన బాణాలు నేరుగా టార్గెట్‌కు తాకాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో, దీనిపై ఎవరైనా స్పందిస్తారో లేదో వేచి చూడాలి..

Related News

వరుణ్ సందేశ్, శ్వేత ‘నా వైఫ్ మిస్సింగ్’ టీజర్ రిలీజ్.. మెప్పించారా?

అగ్గిపెట్టి మచ్చా ఇక లేడు.. అసలు ఏమైంది? మృతికి కారణాలేమిటీ?

పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధం.. కొత్త పార్టీ పేరేంటో తెలుసా?

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

Big Stories

Advertisement
×