E-Paper
Advertisement

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!
Advertisement

Anandhi Remuneration:ఆనంది…వరంగల్ నుంచి వచ్చి తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా గరివిడి లక్ష్మితో మరోసారి సందడి చేసేందుకు సిద్దమైంది.కేవలం గ్లామర్ ని మాత్రమే కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడంతో ఆడియన్స్ లో కూడా ఈ అమ్మడికి స్పెషల్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలి.

ఇక ఆనంది విషయానికి వస్తే ఈమె అసలు పేరు రక్షిత. 1993 జూలై 20న వరంగల్‌లో జన్మించిన రక్షిత 2012లో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ‘ప్రియతమా నీవచట కుశలమా’, ‘నాయక్’, ‘గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాల్లో కనిపించి మెప్పించింది కూడా.

Advertisement

అయితే ఆమె కెరీర్‌కు మంచి టర్నింగ్ మాత్రం ‘కయల్’తో వచ్చింది. ఆ సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన ఆనందికి విమర్శకుల ప్రశంసలతో పాటు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ప్రత్యేక పురస్కారం కూడా దక్కడం విశేషం.

ఇక ‘కయల్’ తర్వాత ఆనంది తమిళంలో వరుసగా ‘పొరియాళన్’, ‘చండి వీరన్’, ‘త్రిషా ఇల్లానా నయనతార’, ‘విసారణై’, ‘పరియేరుమ్ పెరుమాళ్’, ‘ఇరండామ్ ఉలగపోరిన్ కడైసి గుండు’ వంటి సినిమాలలో నటించి కోలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘పరియేరుమ్ పెరుమాళ్’, ‘విసారణై’ వంటి సినిమాలు ఆమె రేంజ్ మరింత పెంచేశాయి.

Advertisement

అయితే తమిళ నాట వరుస సినిమాలు చేసుకపోతూ తెలుగులో గ్యాప్ ఇచ్చిన ఆనంది ఈ మధ్య కాలంలో ‘జాంబీ రెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి సినిమాలతో మళ్ళీ పలకరించింది. ఇక గతేడు వచ్చిన ‘ప్రేమంటే’, ‘భైరవం’ వంటి సినిమాల్లో కనిపించి నేనూ టాలీవుడ్ లోనే ఉన్నానంటూ సాలిడ్ గా సౌండ్ చేసింది.

ఇక ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న‘గరివిడి లక్ష్మి’ఆమె కెరీర్ కి మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఆనంది. ఉత్తరాంధ్రకు చెందిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో రాగ్ మయూర్, నరేష్, రాశి, అంకిత్ కొయ్య తదితరులు నటిస్తుండగా సినిమాని అక్టోబర్ 17న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

ఇక ఆనంది పారితోషికం విషయానికి వస్తే.. ఆమె ఒక్క సినిమాకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య పారితోషికం తీసుకుంటుంది అన్న టాక్ వినిపిస్తుంది. పెద్ద బ్యానర్, ఎక్కువ షూటింగ్ డేట్స్ లేదా హీరోయిన్ ఒరియంటెడ్ కథ అయితే మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఇన్ సైడ్ టాక్.అయితే ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్తగానే పరిగణించాలి.

చూడాలి మరి గరివిడి లక్ష్మితో మరోసారి ఆడియన్స్ ని పలకరించబోతున్న ఆనంది ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో !

ALSO READ :ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

Tags

Related News

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?

జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

27 ఏళ్ల తర్వాత చిరుతో జతకట్టబోతున్న రమ్యకృష్ణ.. ఈ ట్విస్ట్ ఏంటి బాస్?

తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!

Big Stories

Advertisement
×