E-Paper
Advertisement

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?
Advertisement

Nana Patekar:ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దిగ్గజ నటుడు నానా పటేకర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దశాబ్దాలుగా వైవిద్యమైన పాత్రలు, సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. సినిమా రంగానికే పరిమితం కాలేదు.. అటు ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేసిన నానా పటేకర్.. తన సంపాదనలో 90% రైతులకే పంచి పెడుతూ.. అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఈయన గురువారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుమకున్నాయి.

తుది శ్వాస విడిచిన నానాపటేకర్.. ఆయన భార్య ఎవరంటే?

ఇకపోతే నానా పటేకర్ గురించి ఎంతోమందికి తెలిసినా.. ఆయన భార్య నీలకంటి పటేకర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆమె ఒక స్టార్ హీరో భార్య మాత్రమే కాదు.. అంతకుమించి అద్భుతమైన ప్రతిభ కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె పూణేకి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువులో అత్యంత ప్రతిభావంతురాలు. మన దేశంలో అత్యంత కష్టతరమైన ఐఐటి ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి, అబ్బురపరిచారు.ఇంజనీరింగ్ లేదా సైన్స్ రంగంలో నెలకు వేళల్లో ప్యాకేజీ పొందే అవకాశం ఉన్నప్పటికీ.. నాటక రంగం, నటనపై ఉన్న మమకారంతోనే తన ధ్యాసను థియేటర్ ఆర్టిస్ట్ గానే మలుచుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు మరాఠీ థియేటర్లో క్రియాశీలకంగా పని చేసిన ఈమె.. 1973లో జరిగిన మహారాష్ట్ర స్టేట్ డ్రామా కాంపిటీషన్లో ఉత్తమనటిగా ఏకంగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు.

Advertisement

also read:భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

750 రూపాయల ఖర్చుతో పెళ్లి..

ముఖ్యంగా నాటకాల ద్వారానే వీరిద్దరి మధ్య పరిచయం మొదలైంది. ఆ పరిచయం ప్రేమగా మారి, 1978లో కేవలం 750 రూపాయల ఖర్చుతో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారట. పెళ్లైన కొత్తలో వీరి మొదటి కుమారుడు రెండున్నరేళ్ల వయసులోనే కన్నుమూయడం ఈ దంపతులను తీవ్రంగా కలచివేసింది. అనంతరం వీరికి మల్హర్ పటేకర్ అనే కుమారుడు జన్మించారు. కుటుంబ పోషణ నిమిత్తం ఎన్నో ఏళ్లు నటనకు దూరంగా ఉన్న ఈమె.. ఇటీవల ఛావా సినిమాలో ధరావు పాత్ర పోషించి మళ్లీ వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు.

రీ ఎంట్రీలోనూ అద్భుతమైన ప్రదర్శన..

Advertisement

ఇకపోతే నానా పటేకర్ భార్యగానే కాకుండా తనకంటూ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నీలకంటి పటేకర్ 1989లో సచిన్ పిల్ గాంకర్ దర్శకత్వం వహించిన ఆత్మవిశ్వాస్ చిత్రంలో కనబరిచిన అద్భుతమైన నటనకు మహారాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇకపోతే ఐఐటి వంటి రంగాలలో గొప్ప అవకాశాలను పక్కనపెట్టి, కళనే ప్రాణంగా నమ్ముకుని , ఇటు జీవితాన్ని కొనసాగిస్తున్న ఈమె ఎందరికో స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి. అటు తమ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఇటు తమ సహాయ సహకారాల ద్వారా ఎంతో మంది గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచారు నానా పటేకర్ . అలాంటి ఆయన ఆత్మకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

వరుణ్ సందేశ్, శ్వేత ‘నా వైఫ్ మిస్సింగ్’ టీజర్ రిలీజ్.. మెప్పించారా?

అగ్గిపెట్టి మచ్చా ఇక లేడు.. అసలు ఏమైంది? మృతికి కారణాలేమిటీ?

Big Stories

Advertisement
×