E-Paper
Advertisement

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!
Advertisement

Manchu Manoj: హీరో మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనిక మంచు, కుమారుడు ధైరవ్ , కుమార్తె దేవసేన శోభలతో కలిసి మైసూరులోని ప్రసిద్ధ చాముండి కొండలపై వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన మనోజ్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

చాముండేశ్వరి ఆలయంలో మంచు మనోజ్ సతీసమేతంగా ప్రత్యేక పూజలు..

అనంతరం అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి శేషవస్త్రాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. మంచు మనోజ్ కుటుంబ సమేతంగా రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారిని పలకరించేందుకు ఆసక్తి చూపించారు.

దాదా షూటింగ్లో విరామం..

Advertisement

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘దాదా ‘ షూటింగ్ ప్రస్తుతం మైసూరు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మంచు మనోజ్, షూటింగ్ షెడ్యూల్ విరామంలో తన సతీమణి మౌనిక, పిల్లలతో కలిసి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

మంచు మనోజ్ కెరియర్..

మంచు మనోజ్ విషయానికి వస్తే.. కలెక్షన్ కింగ్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మోహన్ బాబు తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన.. అనూహ్యంగా విరామం ప్రకటించి ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. మళ్లీ కొంతకాలం తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక తేజ సజ్జ హీరోగా వచ్చిన మిరాయ్ చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో తన అద్భుతమైన నటన కనబరిచినందుకుగాను ఈయనకు వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు లభిస్తూ ఉండడం గమనార్హం . అలా ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న దాదా సినిమాలో బాలకృష్ణను ఢీకొట్టే విలన్ పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో మంచు మనోజ్ ఎలాంటి సక్సెస్ తో తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.

Advertisement

ఇక్కడ బాలకృష్ణ విషయానికి వస్తే 6 పదుల వయసు దాటిన ఇంకా అంతే ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. నటనకు ఏజ్తో సంబంధం లేదని నిరూపిస్తూ యాక్షన్ సన్నివేశాలకు కూడా ఎలాంటి డూప్ లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

also read: దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

Related News

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

వరుణ్ సందేశ్, శ్వేత ‘నా వైఫ్ మిస్సింగ్’ టీజర్ రిలీజ్.. మెప్పించారా?

అగ్గిపెట్టి మచ్చా ఇక లేడు.. అసలు ఏమైంది? మృతికి కారణాలేమిటీ?

పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధం.. కొత్త పార్టీ పేరేంటో తెలుసా?

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×