Naa Wife Missing Teaser: టాలీవుడ్ లో ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో యూత్‌ను ఊపేసిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట గుర్తుందా? దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ క్యూట్ జోడీ మళ్లీ తెరపైకి వస్తోంది. అయితే ఈసారి లవ్ స్టోరీతో కాకుండా, గూస్‌బంప్స్ తెప్పించే క్రైమ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. వీరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నా వైఫ్ మిస్సింగ్’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. మరి ఈ టీజర్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
‘నా వైఫ్ మిస్సింగ్’ టీజర్ చాలా ఆసక్తికరంగా, వేగంగా సాగిపోతుంది. మొదట్లో వరుణ్ సందేశ్, శ్వేతా బసుల సంప్రదాయబద్ధమైన పెళ్లి, ఆ తర్వాత ఇద్దరూ ఎంతో ఆనందంగా గడిపే లవింగ్ సీన్లతో వీడియో మొదలవుతుంది. కానీ ఆ వెంటనే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇక భార్య కనిపించకుండా పోవడంతో భర్త టెన్షన్ పడటం, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటి సీన్లతో అసలు సస్పెన్స్ మొదలవుతుంది..టీజర్ ఎండ్ అవుతుంది..
ఈ సినిమా కథంతా గోదావరి పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా అమలాపురం పోలీస్ స్టేషన్ నేపథ్యంగా సాగుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. పచ్చని గోదావరి లోకేషన్ల మధ్య జరిగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్లు తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతాయి, అదే ఫార్ములాను ఇక్కడ కూడా పక్కాగా వాడారు.
ఈ చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే.. ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో వరుణ్ సందేశ్ పాత్ర పేరు ‘బాలు’. ఇప్పుడు ఈ కొత్త చిత్రంలో కూడా ఆయన పాత్ర పేరు బాలు కావడం విశేషం. అప్పట్లో లవర్ బాయ్ గా ఉన్న బాలు, ఇప్పుడు భార్యను వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే బాధ్యతాయుతమైన భర్తగా కనిపించనున్నారు. శ్వేతా బసు ప్రసాద్ కూడా చాలా రోజుల తర్వాత పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టారు.
ఈ క్రైమ్ మిస్టరీ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా నేరుగా డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. అక్టోబర్ 22 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది. ముఖ్యంగా ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం. ఇక థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఈ సస్పెన్స్ రైడ్ ఎంజాయ్ చేయవచ్చు.
మొత్తానికి, విడుదలైన టీజర్ చూస్తుంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కలిసిన ఈ కాంబినేషన్ ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. ఇక లవ్ స్టోరీలతో మెప్పించిన ఈ జోడీ, ఈసారి క్రైమ్ థ్రిల్లర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. టీజర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే..
ALSO READ: పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధం.. కొత్త పార్టీ పేరేంటో తెలుసా?