Indiramma Towers: స్వేచ్చ బ్యూరో: క్యూర్ పరిధిలో తొలివిడత ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న లక్ష ఇళ్ల ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా ఏడాది గడువును కాంట్రాక్టర్లకు నిర్ధేశించామని అయితే ఒక నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ. 90 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా ఇస్తామని చెప్పామని వివరించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సహచర మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కే.పీ, వివేకానంద, పలువురు లబ్దిదారులతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 23 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇందిరమ్మ టవర్స్ ను నిరంతర ప్రక్రియగా నిర్మిస్తామని తెలిపారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇళ్ల కోసం 7,000 మందికి పైగా దరఖాస్తులు అందగా, పరిశీలన అనంతరం 5,218 మంది అర్హులుగా తేలారని అర్హులైన వారిలో లబ్ధిదారుల ఎంపికను బహిరంగంగా లక్కీ డ్రా ద్వారా చేపట్టి, 480 మంది లబ్ధిదారులను తుది జాబితాలో ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించామని, ఎవరికి ఏ విధంగా ఇల్లు మంజూరైందనే వివరాలను కూడా లబ్ధిదారులకు తెలియజేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అందజేస్తామని చెప్పారు.
Also read: రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు
ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం ఒక పదవి కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రూప్-1 ద్వారా నియమితులైన శిక్షణ పొందిన అనంతరం వివిధ జిల్లాలకు నూతనంగా నియమితులైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు డి. మౌనికారాణి ( నల్గొండ), సయ్యద్ యూసఫ్ ఆలీ( ఎంవి&ఎ- నల్గొండ), షగుఫ్టా ఫిర్‌డౌస్ ( వరంగల్) డి. సందీప్ కుమార్ ( సంగారెడ్డి), బొంగు మాధవ్( హైదరాబాద్- సౌత్), పి.దీపక్ (మహబూబ్‌నగర్) మంగళవారంసచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు,రిజిస్ట్రేషన్ శాఖ నేరుగా ప్రజల ఆస్తులు, భూములు, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నందున అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువగా, పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగుల అనుభవం, సూచనలు, సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రైసా) రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన వంగ రవీందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు.రెవెన్యూ శాఖలో సంస్కరణలు అనేవి కేవలం కొంతమంది అధికారులు లేదా ప్రభుత్వ పెద్దల ఆలోచనలతో మాత్రమే సాధ్యం కావని, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగుల సూచనలు, అనుభవాలు కలిస్తేనే సమర్థవంతమైన మార్పులు సాధ్యమవుతాయని అన్నారు.
Also read: మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!