Actor Srihari:చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అల్లు శిరీష్ (Allu Sirish), పునర్నవి భూపాలం (Punarnavi bhupalam), ప్రియ భవాని శంకర్ (Priya Bhavani Shankar), అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravi Chander) ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. మరోవైపు తేజ సజ్జ, సాయి ధరంతేజ్ వంటి వారు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రియల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటుడు శ్రీహరి (Sri Hari) ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెద్ద కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీహరి పెద్ద కొడుకు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి శ్రీహరి ఇంట్లో జరగనున్న ఆ శుభకార్యం ఎప్పుడు? శ్రీహరి పెద్ద కొడుకుకు కాబోయే భార్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
దివంగత నటుడు శ్రీహరి, నటి శాంతి దంపతుల పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి వివాహం ఖరారైంది. టాలీవుడ్ లో ఎంతో పేరుగాంచిన ఈ కుటుంబంలో ఇప్పుడు త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇరు కుటుంబాల సమ్మతితో ఫ్రెండ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితోనే శశాంక్ వివాహం నిశ్చయమైనట్లు సమాచారం. ఈ శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శశాంక్ చేసుకోబోయే అమ్మాయి పేరు సంజన అని తెలుస్తోంది శ్రీహరి కుటుంబానికి , సంజనా కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం.
వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించి ముహూర్తాలు కూడా ఖరారు అయ్యాయి. ఇరు కుటుంబాల సభ్యులు వీరిద్దరి నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించాయి. ఇక శశాంక్ సంజన వివాహ వేడుక వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను జరపడానికి పెద్దలు సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీహరి పెద్ద కుమారుడి పెళ్లి వార్త తెలియడంతో టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ALSO READ:నిన్న అమిత్ షా.. నేడు కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రులతో చిరంజీవి భేటీ వెనుక కారణం?
శ్రీహరి విషయానికి వస్తే.. ప్రతి నాయకుడి పాత్రతో వెండితెరకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత హీరోగా మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నారు. 1986లో సినిమాలలోకి స్టంట్ మాస్టర్ గా ప్రవేశించి కెరియర్ మొదలుపెట్టిన శ్రీహరి.. అంచలంచెలుగా ఎదుగుతూ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 1989లో వచ్చిన ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన.. హీరోగా, నిర్మాతగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇటు జిమ్నాస్టిక్స్ లో రాష్ట్రస్థాయి ఛాంపియన్ కూడా.. అలాంటి ఈయన అనారోగ్య సమస్యలతో 2013 అక్టోబర్ 9న కన్నుమూశారు.