srikanth iyengar:ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీలు స్టేజ్ ఎక్కి మైకు పట్టుకున్నారంటే చాలు.. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానంతగా మాట్లాడేస్తూ.. తర్వాత వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాక.. తర్వాత క్షమాపణలు చెబుతూ ఉంటారు. అయితే ఇలా ఈ మధ్యకాలంలో స్టేజ్ ఎక్కి వివాదాల్లో చిక్కుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు శ్రీకాంత్ అయ్యంగర్(Srikanth Iyengar). ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం అలవాటైపోయింది అంటూ కొంతమంది నెటిజన్లు ఈయనపై మండిపడుతున్నారు. ఇకపోతే ఈసారి ఇంకో మెట్టు ఎక్కి” పెళ్లి, ఫస్ట్ నైట్ కూడా ఆన్లైన్లోనే చేసుకుంటారా?” అంటూ రెచ్చిపోయారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
‘కికు చిరంజీవి’ అనే తెలుగు సినిమా ఈ శుక్రవారం అనగా ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ మాట్లాడుతూ.. “ఈ మధ్యకాలంలో థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం కొంతమందికి బద్దకంగా మారింది. మూవీ ఓటీటీలోకి వచ్చాక చూస్తాం అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక పెళ్లి , హనుమాన్ కూడా ఆన్లైన్లోనే చేసుకుంటారా?” అంటూ కామెంట్ చేశారు.
also read:ఇండస్ట్రీలో విషాదం.. కన్నుమూసిన ఐరన్ లేడీ!
ఇకపోతే ఓటీటీలో సినిమా చూసేవాళ్ళు అసలు ప్రేక్షకులే కాదన్నట్లుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శ్రీకాంత్ అయ్యంగర్. అయితే ఆయన ఈ మాటలు అనడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? అనే విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. పెద్ద సినిమాలను థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. చిన్న, మధ్యతరహా సినిమాలు మరీ బాగుంటే తప్ప థియేటర్లకు వెళ్లడం లేదు. అందుకే ఈ విషయంలో ఆయన ఫ్రస్టేట్ అయి ఉంటారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఓటీటీ ప్రియులను ఉద్దేశించి శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అలా శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “గుడికి రోజూ వెళ్ళం కదా అంకుల్.. పూజ గదిలోనే దండం పెట్టుకుంటాం రోజు.. ఎప్పుడో నెలకోసారి గుడి అంతే” అని కామెంట్ పెడితే.. మరొకరు “అలాంటప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఓటీటీకి.. థియేటర్లలోనే సినిమా రిలీజ్ చేయండి” అంటూ ఫైర్ అయ్యారు.. “పెళ్లిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నీ సినిమాలో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా?” అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Movie OTTలోకి వచ్చాక చూస్తాం” అని అనేవాళ్లు.. పెళ్లి, ఫస్ట్ నైట్ కూడా ఆన్లైన్లోనే చేసుకుంటారు.
:- Actor #SrikanthIyengar #KikuChiranjeevi pic.twitter.com/HDVCSWMjMd
— Milagro Movies (@MilagroMovies) August 25, 2026