E-Paper
Advertisement

చెత్తకుప్పలోని చాక్లెట్ల కోసం ఎగబడ్డ జనం.. కాన్పూర్‌లో షాకింగ్ ఘటన!

చెత్తకుప్పలోని చాక్లెట్ల కోసం ఎగబడ్డ జనం.. కాన్పూర్‌లో షాకింగ్ ఘటన!
Advertisement

Expired Chocolates: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గడువు (ఎక్స్‌పైరీ) ముగిసిందని చెత్తకుప్పలో పారేసిన చాక్లెట్ల కోసం జనం ఎగబడ్డారు. అవి ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా.. ఏరుకొని మరి ఇంటికి పట్టుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీగా వస్తే దేనిని వదిలిపెట్టరా అంటూ మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. 4 రోజుల క్రితం జరిగినదిగా తెలుస్తోంది. జాతీయ రహదారి పక్కన చెత్తలో పడి ఉన్న చాక్లెట్లను స్థానికులు సంచుల్లో, డబ్బాల్లో పట్టుకెళ్లడం వీడియోలో చూడవచ్చు. సైకిళ్లు, బైక్‌లపై వచ్చి మరీ ఎక్స్ పైరీ అయిన చాక్లెట్లను తీసుకెళ్లడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఓ ట్రక్కు వచ్చి భారీ ఎత్తున చాక్లెట్లను పారబోయడం తాము చూశామని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

2024లోనే ముగిసిన ఎక్స్‌పైరీ డేట్

ఇదిలా ఉంటే అక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఆ ప్యాకెట్లపై ఉన్న తయారీ, ఎక్స్‌పైరీ వివరాలను ఏమాత్రం పరిశీలించకుండానే ఇంటికి తీసుకెళ్తున్నట్లు అర్థమవుతోంది. అయితే వీడియో తీసిన వ్యక్తి ఆ చాక్లెట్లు ఆరోగ్యానికి హానికరమని, తినవద్దని అక్కడి ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ అతని మాటలను పట్టించుకోకుండా చాక్లెట్లు ఏరుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని సమాచారం.

Advertisement

Also Read: పాట్నాలో భగ్గుమన్న విద్యార్థులు.. BPSC అక్రమాలపై సమరం.. ఉద్రిక్తంగా మారిన సీఎం ఇంటి ముట్టడి!

రంగంలోకి పోలీసులు..

మరోవైపు వైరల్ అవుతున్న వీడియోపై అధికారులు దృష్టి సారించారు. కాన్పూర్ డీసీపీ ఎస్.ఎమ్. ఖాసీం ఘటనపై స్పందించారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పంకీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ను ఆదేశించినట్లు వెల్లడించారు. మరోవైపు ఎక్స్ పైరీ అయిన వాటిని ప్రజలు తినకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Also Read: ఈశ్వర్ సాయి మాటలు నమ్మొచ్చా? మాధురి వివాదంలో కొత్త డౌట్స్

Tags

Related News

భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా? – ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్లు!

ఎలక్షన్ కమిషన్ రచ్చ వేళ.. చెన్నైలో విజయ్‌తో రాహుల్ కీలక సమావేశం!

రాష్ట్రపతి భవన్‌ భేటీతో మారిన పొలిటికల్ గేమ్‌.. ఓటు చోరీకి రాహుల్ ఇస్తున్న ఆధారాలేంటి?

మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!

‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి’! .. కేంద్రానికి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

Big Stories

Advertisement
×