E-Paper
Advertisement

మల్లె పూల పల్లకి వెనుక ఇంత కథ ఉందా?

మల్లె పూల పల్లకి వెనుక ఇంత కథ ఉందా?
Advertisement

Malle Poola Pallaki Song: ”మల్లె పూల పల్లకి బంగారు పల్లకి” ..ఇదివరకే ఉన్న ఈ అయ్యప్ప స్వామి పాట ఇరుముడి సినిమాతో మరింత పాపులర్ అయిపొయింది.ఎంతలా అంటే థియేటర్ లో ఈ పాట వస్తుంటే ఆడియన్స్ సీట్లో కూర్చోకుండా లేచి పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేంత.ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమాకి మేజర్ వసూళ్లు ఈ పాట వల్లే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాంటి ఈ పాట వెనకాల ఉన్న పలు సంగతుల్ని తెలుకుందాం.

పదిహేనేళ్ళ కిందట పాట 

నిజానికి ఈ పాట ఇప్పటిది కాదు.ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట ప్రముఖ గాయకుడు డప్పు శ్రీను గాత్రంతో వచ్చి అయ్యప్ప భక్తులందరిని పారవశ్యంలో ముంచెత్తిన పాట.ఇక ఈ పాట లేకుండా ఏ అయ్యప్ప పూజ, కార్యక్రమం పూర్తి కాదంటే ఆశ్చర్యం లేదు. అంతలా అప్పట్లో సెన్సేషన్ అయిన ఈ పాటని మళ్ళీ ఇరుముడి అనే సినిమాలో పెట్టాలని ఫిక్స్ అయ్యాడు దర్శకుడు శివ నిర్వాణ.

Advertisement

సినిమా అయ్యప్ప స్వామి నేపథ్యంలో సాగడం, పైగా హీరోగా రవితేజ నటిస్తుండటంతో ఈ పాట ఎలా ఉంటుందా అంటూ అంచనాలు పెంచేసుకున్నారు అయ్యప్ప అభిమానులు.అయితే సినిమా ఇలా రిలీజ్ అయిందో లేదో మల్లె పూల పల్లకి అనే పాట ఒక్కసారిగా సెన్సేషన్ టాక్ తెచ్చుకుంది.పాట అంటే ఇది కదా అని మురిసిపోయారు భక్త మహాశయులు.

నోస్టాల్జియా గా ఫీలయిన అభిమానులు

ముఖ్యంగా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఎవరో కొత్త సింగర్ తో కాకుండా అప్పుడు పాడిన డప్పు శ్రీను తోనే ఈ పాట పాడించడం,పైగా డివోషన్ టచ్ ఉన్న ఈ పాటకి రవితేజ మాస్ ఎనర్జీ యాడ్ అవడంతో పాట రేంజ్ మరింత పెరిగిపోయింది.ఒక రకంగా డప్పు శ్రీను తోనే ఈ పాట మళ్ళీ పాడించాలన్న శివ నిర్వాణ ఆలోచనని మెచ్చుకొని తీరాలి.ఎందుకంటే ఈ పాటని ఆయన గొంతుతో విని విని అలవాటు పడిపోయారు.

Advertisement

ఈ సమయంలో వేరే సింగర్ తో పాడిస్తే ఖచ్చితంగా పోలికలు వచ్చే అవకాశమే ఎక్కువ.అలా కాకుండా డప్పు శ్రీను తోనే పాడిస్తే ఒక రకమైన నోస్టాల్జియా గా ఫీలయ్యారు అభిమానులు.అయితే ఈ పాట విన్న మరి కొంతమంది వాయిస్ లో అప్పటి బేస్ లేదని కామెంట్స్ చేశారు కూడా.అయినప్పటికీ మేకర్స్ మొండిగా ముందుకు వెళ్ళడం విశేషం.ఇది ఒకరకంగా ఆ సింగర్ ని గౌరవించినట్టే.

సరికొత్త మ్యూజిక్ ట్రీట్మెంట్

ఇక మ్యూజిక్ అందించిన జీవి ప్రకాష్ కుమార్ కూడా పాటని ఇలాగే యథాతథంగా ఉంచకుండా దానికి తనదైన సరికొత్త మ్యూజిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం మెచ్చుకోతగ్గ విషయం.మాములుగా ఇలాంటి పాటల్ని రీమిక్స్ చేసేటప్పుడు వోరిజినల్ కి భిన్నంగా ప్రయత్నించాలనుకుంటారు మ్యూజిషియన్స్.కాని వోరిజినల్ ఫీల్ పోగొట్టకుండానే సరికొత్త ఫీల్ అందించాడు జీవి.

also read :ఈశ్వర్ సాయి మాటలు నమ్మొచ్చా? మాధురి వివాదంలో కొత్త డౌట్స్

ఇందులో భక్తి టచ్ ఉంటూనే రవితేజ ఎనర్జీకి సరిపోయేలా మాస్ టచ్ ఉండటం చూస్తే జీవి టాలెంట్ అర్థమవుతుంది.ఇక శేఖర్ మాస్టర్ అందించిన కోరియోగ్రఫీ కూడా పాటకి మెయిన్ ఎసెట్ గా నిలిచింది. ఇక ఇందులో బేబీ నక్షత్ర వేసిన స్టెప్పులు అయితే టాప్ నాచ్.

సాలిడ్ హిట్ అందించిన సాంగ్ 

మొత్తంగా ఆనాడు ఒక ఊపు ఊపిన ఈ ”మల్లె పూల పల్లకి బంగారు పల్లకి”అనే పాట ఎట్టకేలకి ఇలా ఇరుముడి సినిమాలో మరో సారి ప్రత్యక్షమై అటు రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవడమే కాకుండా డీలా పడిపోతున్న సినీ ఇండస్ట్రీకి ఒక సాలిడ్ హిట్ ని బంగారు పల్లకిలో అందించింది అన్నమాట !

Tags

Related News

‘ఇరుముడి’ థియేటర్లపై ఎగ్జిబిటర్ల ఆవేదన.. న్యాయమేనా?

చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?

నాని ‘ ప్యారడైజ్ ‘ కు ఆ టైం ఉండదా? ఇదేం ట్విస్ట్ మావా..

‘వారణాసి’ మూవీకి అలాంటి లేవట.. అసలు జక్కన్న ప్లానేంటబ్బా..?

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. ఆ ఒక్కటే డైరెక్టర్ మిస్టేకా..?

Big Stories

Advertisement
×