E-Paper
Advertisement

తండ్రి మొదటి కారు కోసం విష్ణు మంచు ఇంత చేశాడా?

తండ్రి మొదటి కారు కోసం విష్ణు మంచు ఇంత చేశాడా?
Advertisement

Manchu Vishnu:మన జీవితంలో ఎన్నో విలువైన వస్తువులని, ఎంతో ఖర్చుపెట్టి కొంటూ ఉంటాము,కానీ మొట్టమొదటి సారిగా కొన్న వస్తువులని అస్సలు మర్చిపోలేము.అవి కేవలం వస్తువులుగా కాకుండా మన ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించిన జ్ఞాపకాలుగా మన మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఇక అవి పాతబడినా వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాము కూడా.

ఇదిగో అలాంటి ఒక వస్తువుని బయటికి తీసి అపురూపంగా మరింత ప్రేమగా పునరుద్ధరించాడు మంచు విష్ణు. అవును ..తన తండ్రి మోహన్ బాబు కెరీర్ తొలినాళ్ళలో ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన ప్రీమియర్ పద్మిని అనే కార్ ని మళ్ళీ రోడ్డు పైకి తెచ్చేందుకు సరికొత్తగా తీర్చిదిద్దాడు.

కొన్ని వస్తువులు కేవలం యంత్రాలు కావు 

Advertisement

ఇదే విషయాన్ని తన ఇంస్టాలో పంచుకున్న విష్ణు ..”కొన్ని వస్తువులు కేవలం యంత్రాలు కావని తెలిపాడు.ఈ ప్రీమియర్ పద్మిని అనే కారు తన తండ్రి మొదటి కారని, దీన్ని తిరిగి బతికించుకోవాల్సిన జ్ఞాపకం అని,దీన్ని ఎంతో ప్రేమగా, చాలా జాగ్రత్తగా, ప్రతీ విషయాన్ని పరిశీలిస్తూ దీన్ని మళ్ళీ పునరుద్దరించాము.

ఇదీ మళ్ళీ రోడ్లపై పరుగులు పెట్టడానికి సిద్దం అయిపొయింది.మా కుటుంబంలో ఒక చిన్న భాగంగా ఉన్న ఈ కార్ ఇపుడు మళ్ళీ పునర్వైభావాన్ని సొంతం చేసుకుంది” అంటూ ఎమోషనల్ పోస్ట్ వదిలాడు.ఇక మంచు విష్ణు ఇలా పోస్ట్ పెట్టాడో లేదో నిమిషాల్లో ఈ పోస్ట్ వైరల్ అయిపొయింది.

Advertisement

నిజానికి కొన్న మొదటి కారు ఎంతో మందికి అపురూపమే, కుటుంబం అంతా తొలినాళ్ళలో అందులో జర్నీ చేసినరోజులని, చూసిన సరదా సంఘటనలని మనం అస్సలు మర్చిపోలేము. ఎన్నో విలువైన, చిన్ననాటి మధుర స్మృతులన్నీ వాటితోనే ముడిపడి ఉంటాయి.

ప్రీమియర్ పద్మిని విషయానికి వస్తే

ఇక మోహన్ బాబు కొన్న ప్రీమియర్ పద్మిని విషయానికి వస్తే.. ఒకప్పుడు ఈ కార్లు ఆటోమొబైల్ రంగాన్ని ఒక ఊపు ఊపేశాయి. ఇటాలియన్ ఫియట్ 1100 మోడల్ ని బేస్ చేసుకుని ఇండియాలో తయారైన ఈ కార్లకి ఒకప్పుడు ఎక్కడ లేని క్రేజ్ ఉండేది.ముఖ్యంగా ప్రముఖులు ఈ కార్లని సొంతం చేసుకోవడానికి పోటీ పడేవారు.అలా 1960ల నుంచి 1990ల వరకు ఎక్కడ చూసినా ఈ కార్లే దర్శనమిచ్చేవి.

సో మంచు విష్ణు తండ్రి కొన్న మొదటి కారుని జాగ్రత్తగా దాని వింటేజ్ లుక్ పోకుండా సరికొత్తగా మళ్ళీ రోడ్లపై పరుగులు పెట్టిస్తాడన్న మాట.

ఏ సినిమాని అనౌన్స్ చేస్తాడో 

ఇక మంచు సినిమాల విషయానికి వస్తే గతేడాది కన్నప్పతో పలకరించిన విష్ణు ఇప్పటిదాకా మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించకపోవడం గమనార్హం.చూడాలి మరి ముందు ముందు ఏమైనా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టి షాకిస్తాడో !

Tags

Related News

బలవంతం చేశారు.. ‘మల్లీశ్వరి’ లో పాత్ర పై సింగర్ షాకింగ్ కామెంట్!

హనుమాన్ అంశ్‌కు తెలుగులో షాక్.. అసలేం జరిగింది?

బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?

వితికా షేరు, రాజీవ్ కనకాలతో సందడిగా మారిన సిస్ట్లా..గ్రాండ్ సెలబ్రేషన్స్!

అల్లు అర్జున్ భార్య అందానికి ఫ్యాన్స్ ఫిదా.. ఫొటోలు వైరల్

వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

Big Stories

Advertisement
×