E-Paper
Advertisement

మంత్రి అనుకొని.. సామాన్య యువతిపై ట్రోల్స్.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన బాధితురాలు!

మంత్రి అనుకొని.. సామాన్య యువతిపై ట్రోల్స్.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన బాధితురాలు!
Advertisement

Online Trolling: తమిళనాడు మంత్రి ఎస్. కీర్తనను పోలి ఉన్న ఓ యువతికి నెట్టింట దారుణ పరాభవం ఎదురైంది. సదరు మంత్రి రాజకీయ ప్రత్యర్థులు పొరపాటున ఈ సామాన్య మహిళను టార్గెట్ చేస్తూ ఆమె పొట్టి డ్రెస్సులో ఉన్న వీడియోను విపరీతంగా వైరల్ చేశారు. రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ ఇలాంటి బట్టలు వేసుకోని ఏం సందేశం ఇస్తున్నారంటూ ఈమె వీడియోతో మంత్రి కీర్తనను ప్రశ్నించడం ప్రారంభించారు. తీరా అసలు మహిళ తెరపైకి రావడంతో అప్పటివరకూ మంత్రి అని భావిస్తూ వీడియోను షేర్ చేసిన వారంతా ఖంగు తిన్నారు.

అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం మలేషియాలో జీవిస్తున్న వినోషా రవి అనే యువతికి.. తమిళనాడు మంత్రి ఎస్. కీర్తనకు మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వినోషా పొట్టి డ్రెస్ లో ఉన్న దృశ్యాలను మంత్రికి ఆపాదిస్తూ ప్రతిపక్ష డీఎంకే కార్యకర్తలు నెట్టింట విపరీతంగా ట్రోల్స్ ప్రారంభించారు. వీడియో మరింత వైరల్ కావడంతో ఆ మహిళపై విపరీతమైన ట్రోలింగ్, అసభ్యకరమైన కామెంట్లు రావడం మొదలయ్యాయి.

Advertisement

పోలీసులకు ఫిర్యాదు

అయితే వినోషా పనిచేస్తున్న ఆఫీసులోని వారు ఆ వీడియోను చూసి.. ట్రోలింగ్ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మెుదట ఏదో పొరపాటు జరిగిందని భావించి ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు వినోషా తెలిపారు. కానీ ట్రోలింగ్ హద్దు దాటుతుండటంతో తాను తప్పక రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని యువతి పేర్కొన్నారు. పైగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో తన సోషల్ మీడియా ఖాతాల్లోది కాదని.. దానిని ఎవరో సీక్రెట్ గా చిత్రీకరించి ఉద్దేశపూర్వకంగా నెట్టింట పోస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై మలేషియా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.

మంత్రి రియాక్షన్ ఇదే..

Advertisement

మరోవైపు పొట్టి డ్రెస్సులో కనిపించినందుకే ఈ స్థాయిలో ట్రోల్ చేయడాన్ని మంత్రి కీర్తన సైతం తప్పుబట్టారు. ‘మహిళలు ఏ రకమైన దుస్తులు ధరిస్తున్నారో చూసి జడ్జ్ చేయడం వాళ్ల క్రూరమైన మనస్తత్వానికి నిదర్శనం. ఒకవేళ వీడియో ఉన్న వ్యక్తి నేనే అయినా అందులో తప్పేముంది’ అని మంత్రి కీర్తన ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చారు.

Also Read: చెత్తకుప్పలోని చాక్లెట్ల కోసం ఎగబడ్డ జనం.. కాన్పూర్‌లో షాకింగ్ ఘటన!

ట్రోల్ చేసినా తగ్గేదేలే

ఇదిలా ఉంటే పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైనా తాను మారబోనని వినోషా రవి అన్నారు. ‘ఎవరో ఆన్‌లైన్‌లో నన్ను విమర్శించినంత మాత్రాన నేను నా డ్రెస్సింగ్ స్టైల్‌ని లేదా నన్ను నేను మార్చుకోను’ అని చెప్పారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. తమకు ఏ దుస్తులు వేసుకోవాలో బాగా తెలుసని చెబుతూ ట్రోలర్లకు ఆమె సైతం ఘాటైన సమాధానం ఇచ్చారు.

Also Read: వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

Tags

Related News

ఆదివారం సీజేపీ నిరసనలు.. జంతర్ మంతర్ వద్దకు రావాలని పిలుపు, భారీగా మోహరించిన పోలీసులు

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, తగలబడిన ఇళ్లు- దుకాణాలు, తొమ్మిది మంది మృతి

భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా? – ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్లు!

ఎలక్షన్ కమిషన్ రచ్చ వేళ.. చెన్నైలో విజయ్‌తో రాహుల్ కీలక సమావేశం!

రాష్ట్రపతి భవన్‌ భేటీతో మారిన పొలిటికల్ గేమ్‌.. ఓటు చోరీకి రాహుల్ ఇస్తున్న ఆధారాలేంటి?

మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!

‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి’! .. కేంద్రానికి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×