E-Paper
Advertisement

ఇండస్ట్రీలో విషాదం.. కన్నుమూసిన ఐరన్ లేడీ!

ఇండస్ట్రీలో విషాదం.. కన్నుమూసిన ఐరన్ లేడీ!
Advertisement

Asha Singh jaiswal:చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర దుఃఖానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 94 సంవత్సరాల వయసులో ఏడు దశాబ్దాల కెరియర్ లో నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి పని చేసిన ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి వృద్ధాప్య కారణాలతో తుది శ్వాస విడిచింది. ఆమె మరణాన్ని సినీ సెలబ్రిటీలు, అభిమానులు మరువకముందే.. ఇప్పుడు ఇండస్ట్రీలో “ఐరన్ లేడీ”గా గుర్తింపు తెచ్చుకున్న ఆశాసింగ్ మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ప్రముఖ సీనియర్ నటి మృతి..

ప్రముఖ సీనియర్ నటిగా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా , సామాజిక సేవకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఆశా సింగ్ జైస్వాల్. సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ తో పాటు లైవ్ ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఆగస్టు 22 రాత్రి 7:30 గంటల సమయంలో ముంబైలో తుది శ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు ఆకాష్ భరద్వాజ్ (Aakash bharadwaj) అధికారికంగా ప్రకటించారు. ఆమె మరణ వార్తను ఆలస్యంగా ప్రకటించడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటీమణిని కడసారి చూసుకోవడానికి కూడా వీలు లేకుండా చేశారు అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

తల్లి మృతిపై ఆకాష్ భరద్వాజ్ ఎమోషనల్ పోస్ట్..

Advertisement

ఆశాసింగ్ జైస్వాల్ మరణం పై ఆమె కొడుకు ఆకాష్ భరద్వాజ్ ఎమోషనల్ పోస్టు పంచుకున్నారు. తన తల్లి ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఒక సుదీర్ఘ ప్రకటన చేశారు. తన తల్లిని ఐరన్ లేడీగా అభివర్ణించిన ఆకాష్ భరద్వాజ్.. తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి అంటూ అభిమానులను కోరారు. జీవితంలో కళా, పని, సేవే అన్నిటికంటే ముఖ్యమైనవని, ఆమె చేసిన సేవలు, కళారంగానికి అందించిన సహకారాలను గుర్తు చేసుకోవడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఆమె మృతి పట్ల పలువురు సినీ , టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్స్, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 83 ఏళ్ల వయసులో ఆశాసింగ్ మనల్ని వదిలి వెళ్లిపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. అయితే ఆమె మరణించడానికి గల కారణాలను మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఆమె వయసు 83 సంవత్సరాలు.

also read:కొరియన్ కనకరాజు స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎక్కడ చూడొచ్చంటే?

ఆశాసింగ్ కెరియర్..

Advertisement

ప్రముఖ నటి మీనా కుమారిని అనుకరిస్తూ చేసిన ఎన్నో మిమిక్రీ ప్రదర్శనలు ఈమెకు మంచి ఆదరణ తీసుకొచ్చాయి. ఇక టెలివిజన్ ప్రేక్షకులకు బిఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్ లో కృపాచార్యుడి సోదరి కృపి పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఎక్కువగా హిందీలోనే సినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. నేడు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇకపోతే ఈమె అంత్యక్రియలను ఆగస్టు 23న విలే పార్లే వెస్ట్ లోని పవన్ హన్స్ స్మశాన వాటికలో పూర్తి చేశారు.

Related News

టాక్సిక్‌కు టికెట్ రేట్లు పెంచేశారు.. ఎంతంటే?

మల్లె పూల పల్లకి వెనుక ఇంత కథ ఉందా?

‘ఇరుముడి’ థియేటర్లపై ఎగ్జిబిటర్ల ఆవేదన.. న్యాయమేనా?

చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?

నాని ‘ ప్యారడైజ్ ‘ కు ఆ టైం ఉండదా? ఇదేం ట్విస్ట్ మావా..

‘వారణాసి’ మూవీకి అలాంటి లేవట.. అసలు జక్కన్న ప్లానేంటబ్బా..?

Big Stories

Advertisement
×