E-Paper
Advertisement

చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!

చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!
Advertisement

Trivikram:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassishta mallidi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం విశ్వంభర. ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదలకు సిద్ధమయ్యింది అంటూ వార్తలు వినిపించినా.. ఇప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. ఇన్నిసార్లు వాయిదా పడడానికి గల కారణం ఏమిటి అని అంటే.. కేవలం విఎఫ్ఎక్స్ అనే కారణం మాత్రమే వినిపిస్తోంది. మరి ఇన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు దసరాకు విడుదల కాబోతోంది అంటూ ప్రకటించారు. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దసరాకి కూడా రావడం లేదనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ దసరా పై ఇప్పుడు త్రివిక్రమ్(Trivikram ) కన్ను వేసినట్లు సమాచారం. మరి అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

దసరా బరిలో ఆదర్శకుటుంబం..

మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. గతంలో వెంకటేష్ (Venkatesh ) చిత్రాలకు డైలాగ్ గ్రేటర్ గా పనిచేశారు. కానీ ఇన్నేళ్ల కెరియర్ లో తొలిసారి ఆయనతో దర్శకుడిగా చేస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం ఏకే 47. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఒక్కొక్క అప్డేట్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు గత కొంతకాలంగా మేకర్స్ ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ డేటును వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ:బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?

దసరా బరి నుండి విశ్వంభరా తప్పుకున్నట్టేనా?

అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా దసరాకు విడుదల చేయాల్సి ఉండగా.. అప్పుడు ఈ సినిమా విడుదల కావట్లేదట. అందుకే అక్టోబర్ 2న కాకుండా ఆదర్శ కుటుంబం చిత్రాన్ని దసరా హాలిడేస్ లో అనగా అక్టోబర్ 16 వ తేదీన విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దసరా సెలవులతో పాటు ఆ సమయంలో విడుదలయ్యే చిత్రాలు జైలర్2 మాత్రమే ఉండడంతో పెద్దగా పోటీ లేని కారణంగా త్రివిక్రమ్ ఈ డేటులో ఆదర్శ కుటుంబం చిత్రాన్ని విడుదల చేసి కలెక్షన్స్ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో..

Advertisement

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విశ్వంభర సినిమా దసరా బరి నుండి తప్పుకోబోతుండడంతో.. త్రివిక్రమ్ ఆస్థానాన్ని భర్తీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా ఒకవేళ అన్నీ అనుకున్నట్టు త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 16న విడుదల అయితే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?

నాని ‘ ప్యారడైజ్ ‘ కు ఆ టైం ఉండదా? ఇదేం ట్విస్ట్ మావా..

‘వారణాసి’ మూవీకి అలాంటి లేవట.. అసలు జక్కన్న ప్లానేంటబ్బా..?

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. ఆ ఒక్కటే డైరెక్టర్ మిస్టేకా..?

ఇదేం ప్రమోషన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..  కిల్లింగ్ లుక్ లో హాట్ బ్యూటీ..

షట్‌డౌన్ దిశగా కోలీవుడ్?.. బంద్‌పై ‘ఫెఫ్సీ’ కీలక విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×