E-Paper
Advertisement

టాక్సిక్‌కు టికెట్ రేట్లు పెంచేశారు.. ఎంతంటే?

టాక్సిక్‌కు టికెట్ రేట్లు పెంచేశారు.. ఎంతంటే?
Advertisement

Toxic Movie Ticket Prices: టాక్సిక్ …గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్ హౌస్ పై వస్తున్న లేటెస్ట్ ఫిలిమ్ టాక్సిక్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టిన kgf 2 తర్వాత యష్ నుండి వస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.ఇక ఎట్టకేలకి సినిమా ఆగస్ట్ 26న థియేటర్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్దం అయింది.

టికెట్ రేట్స్ ఎంతంటే ..

ఈక్రమంలోనే టాక్సిక్ సినిమా టికెట్ల విషయంలో తెలంగాణా సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చంటూ ఆర్డర్ పాస్ చేసేసింది. ధరల విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో ఒకో టికెట్ పై 50రూపాయలు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చిన సర్కార్ మల్టీఫ్లెక్స్ మరియు స్పెషల్ థియేటర్ లలో 100 రూపాయలని పెంచుకునేలా ఆదేశాలు ఇచ్చింది.ఇక ఇందులోనే gst కూడా కలిపే ఉంటుందండోయ్.

పది రోజులు దుమ్ము దులిపే అవకాశం

Advertisement

ఇక పెంచిన ఈ ధరలు మొత్తం పదిరోజుల పాటు అంటే ఈ ఆగస్ట్ 26 నుండి వచ్చే నెల సెప్టెంబర్4 వరకు వర్తిస్తాయని తెలిపింది. పైగా ఈ సినిమా రోజుకి ఐదు షోలు వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది కూడా.అంటే ఈ లెక్కన పెరిగిన ధరలతో పాటు,పెంచిన స్క్రీనింగ్ షో ల లెక్కన చూస్తే టాక్సిక్ సినిమా నైజాం లో పది రోజులు దుమ్ము దులిపే అవకాశం పుష్కలంగా ఉందన్న మాట.

also read :మల్లె పూల పల్లకి వెనుక ఇంత కథ ఉందా?

Advertisement

పైగా సినిమాని దిల్ రాజు ఏకంగా వంద కోట్లపైగా పెట్టి రైట్స్ దక్కించుకున్నాడని ఒక టాక్ నడుస్తుంది.సినిమా గనుక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే గనుక దిల్ రాజు బూరెల బుట్టలో పడ్డట్టే .

ఒక చిన్న మెలిక కూడా

ఇక ఇదిలా ఉంటే తెలంగాణా సర్కార్ టికెట్స్ రేట్స్ పెంచినట్టే పెంచి ఒక చిన్న మెలిక కూడా పెట్టింది.అవును…టికెట్ రేట్స్ హైక్ ఇచ్చినందుకు KVN–Monster Mind Creations LLP సంస్థ ఒక కోటి రూపాయలని తెలంగాణా ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఉన్న telugu Film Industry Employees’ Welfare Committee Account లో జమ చేయాలని ఆర్డర్ ఇచ్చింది.దీనిని తెలుగు సినీ పరిశ్రమలో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం వాడుతారని తెలుస్తుంది.

రేట్లు పెంచడం కొత్తేమీ కాదు

నిజానికి ఇలా ఇండస్ట్రీ లో టికెట్ రేట్లు పెంచడం కొత్తేమీ కాదు. హీరో క్రేజ్, పెరిగిన బడ్జెట్లు, అభిమానులకి మొదటి రోజే చూడాలనే ఆరాటం ..వెరసి మొదటి రోజే భారీ స్థాయిలో రేట్లు పెంచుకుని తెచ్చుకోవడం మనకి తెల్సిందే.అయితే జరిగిన అనేక సంఘటనల తర్వాత రీజనబుల్ గా టికెట్ రేట్లని పెంచి కామన్ ఆడియన్స్ కి సినిమాని అందుబాటులో తెచ్చిన సర్కార్ , తెలుగు సినీ పరిశ్రమలో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం డబ్బుని జమ చేయాలని చెప్పడం ఇక్కడ మంచి విషయం.

also read :ఈశ్వర్ సాయి మాటలు నమ్మొచ్చా? మాధురి వివాదంలో కొత్త డౌట్స్

చూడాలి మరి ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ రాఖీ భాయ్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో !

Tags

Related News

హనుమాన్ అంశ్‌కు తెలుగులో షాక్.. అసలేం జరిగింది?

బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?

వితికా షేరు, రాజీవ్ కనకాలతో సందడిగా మారిన సిస్ట్లా..గ్రాండ్ సెలబ్రేషన్స్!

అల్లు అర్జున్ భార్య అందానికి ఫ్యాన్స్ ఫిదా.. ఫొటోలు వైరల్

వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

ఎక్కడ చూసినా జిమ్ జిమ్ తార.. ఇప్పుడు అనుపమ వంతు!. వైరల్ వీడియో

Big Stories

Advertisement
×