E-Paper
Advertisement

భాగవతం కథతో పాన్ ఇండియా ప్లాన్.. ఏకంగా 7 సినిమాలు!

భాగవతం కథతో పాన్ ఇండియా ప్లాన్.. ఏకంగా 7 సినిమాలు!
Advertisement

Bhagavatam Moviesపౌరాణిక సినిమాలు ఇపుడు మరోసారి క్యూ కడుతున్నాయి .అవును ఒకప్పుడు ఎంతగానో అలరించిన ఈ సినిమాలని ఇపుడు మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇదిగో ఇదే క్రమంలో ఒకప్పుడు టీవీల ముందు కోట్లాది మందిని కూర్చోబెట్టిన రామానంద్ సాగర్ కుటుంబం నుంచి మరో బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.ఆది కూడా ఈసారి ఏకంగా శ్రీమద్ భాగవతం ఆధారంగా ఏడు సినిమాల సిరీస్‌ను తీసుకురాబోతున్నట్లు సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. గురుపౌర్ణమి సందర్భంగా ఈ ప్రకటన రావడంతో భక్తులతో పాటు సినిమా అభిమానుల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఇక ఈ సిరీస్‌కు “సప్త” అనే పేరు పెట్టారు. మన దగ్గర శతాబ్దాలుగా జరుగుతున్న భాగవత సప్తాహ పారాయణం సంప్రదాయాన్ని ఆధారంగా తీసుకుని మొత్తం కథను ఏడు సినిమాలుగా చెప్పాలని ప్లాన్ చేశారు మేకర్స్ . అంటే ఒక్కో సినిమా ఒక్కో కథలా కాకుండా… ఒక భాగం ముగిసిన దగ్గర నుంచి మరో భాగం మొదలయ్యేలా మొత్తం ఫ్రాంచైజీని డిజైన్ చేస్తున్నారట.

Advertisement

ఇదే మొదటిసారి

అయితే ఇప్పటివరకు పౌరాణిక కథల మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ మొత్తం భాగవత మహాపురాణాన్ని ఇంత పెద్ద స్థాయిలో సినిమాల రూపంలో తీసుకురావాలని ప్రకటించడం మాత్రం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాల మాట.

Advertisement

ఇందులో ధ్రువుడి భక్తి, ప్రహ్లాదుడి కథ, గజేంద్ర మోక్షం, సముద్ర మథనం, వామనావతారం, శ్రీకృష్ణుడి జననం, గోకుల లీలలు, కంస వధ, గోవర్ధన గిరి ఎత్తడం, రుక్మిణి కళ్యాణం, ద్వారక రాజ్యం, ఉద్ధవ గీత లాంటి ఎన్నో గొప్ప ఘట్టాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ కథను ఏ పార్ట్‌లో చూపిస్తారో మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

సాగర్ పిక్చర్స్ మాత్రం ఒక విషయం క్లియర్‌గా చెప్పింది. భాగవతంలో ఉన్న అసలు కథను మార్చకుండా, ప్రామాణికంగా, భక్తి భావానికి ఎక్కడా భంగం కలగకుండా సినిమాలు రూపొందిస్తామని తెలిపింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటినుంచే అంచనాలు పెరుగుతున్నాయి.

పురాణాల ఆధారంగా వచ్చిన సినిమాలు

ఇక గత కొన్నేళ్లుగా పురాణాల ఆధారంగా వచ్చిన సినిమాలు కూడా ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ తీసుకొచ్చాయి. 2023లో వచ్చిన “ఆదిపురుష్” భారీ అంచనాలతో వచ్చి విమర్శల పాలు అయింది. మరోవైపు 2024లో వచ్చిన “కల్కి 2898 AD” పురాణాలకు సైన్స్ ఫిక్షన్ టచ్ ఇచ్చి ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం విశేషం.

అలాగే “రామాయణ” పేరుతో రూపొందుతున్న భారీ బాలీవుడ్ సినిమా కూడా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో “శ్రీమద్ భాగవతం – సప్త” కూడా చేరడంతో పౌరాణిక సినిమాల రేసు మరింత ఆసక్తికరంగా మార్చిందనే చెప్పాలి.

ఇక సాగర్ కుటుంబానికి పౌరాణిక కథలతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1987లో వచ్చిన రామాయణం టీవీ సీరియల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత శ్రీకృష్ణ, లవకుశ లాంటి పౌరాణిక సీరియల్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు అదే బ్యానర్ నుంచి భాగవతం వస్తుండటంతో ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.

బాగా ఆకట్టుకుంటుంది అన్నది నిజం

అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరోలు ఎవరు? శ్రీకృష్ణుడి పాత్ర ఎవరు చేస్తారు? దర్శకుడు ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? విజువల్ ఎఫెక్ట్స్ ఏ స్టూడియో చూసుకుంటుంది? బడ్జెట్ ఎంత? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? మొదటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఏది ఏమైనా సినిమా ఎప్పుడు వచ్చినా సినీ ప్రియుల్ని ,రామ భక్తుల్ని బాగా ఆకట్టుకుంటుంది అన్నది నిజం.

also read :షూటింగ్‌కు బ్రేక్.. పిల్లలతో స్పైడర్‌మ్యాన్ చూసిన బన్నీ!

Related News

ఈ హీరోయిన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూస్తే కళ్లు తిరిగిపోతాయి..!

ఏఐ వస్తే నాయకుల ఆట క్లోజ్ అంటున్న ఆర్జీవీ!

షూటింగ్‌కు బ్రేక్.. పిల్లలతో స్పైడర్‌మ్యాన్ చూసిన బన్నీ!

త్రినాధరావు నక్కిన మ్యాజిక్ మళ్లీ స్టార్ట్… హవీష్ సాంగ్ వైరల్!

ఎవరికి ఏం జరిగినా చిరునే కావాలా..? ఇదేం లాజిక్..!

విశ్వంభరా… వస్తున్నావా..? లేక ఊరికే చెబుతున్నావా..?

అరుదైన మొక్కకి పవన్ కళ్యాణ్ పేరు..అసలు స్టోరీ ఇదే!

Big Stories

Advertisement
×