Allu Arjun Enjoys Spider-Man Movie: బన్నీ ఎంత బిజీ అయినా ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ అవడు, బన్నీ షేర్ చేసే ఫ్యామిలీ వెకేషన్స్ పిక్స్,పార్టీస్ ఇలా అన్నీ మనకి ఆ విషయం చెబుతుంటాయి కూడా. ఇదిగో ఈసారి అదే పని చేశాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజైన కొత్త స్పైడర్‌మ్యాన్ సినిమాను తన ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ స్పైడర్‌మ్యాన్ సినిమా రన్‌టైమ్ 2 గంటల 14 నిమిషాలు ఉందని తెలుస్తుంది.అంటే దాదాపు 134 నిమిషాల పాటు యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, హాలీవుడ్ స్టైల్ విజువల్స్‌తో ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసేలా సినిమా సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు స్పైడర్‌మ్యాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ పిల్లలు కూడా ఈ సినిమాను పెద్ద స్క్రీన్‌పై చూడాలని కోరుకోవడంతో బన్నీ వాళ్లతో కలిసి థియేటర్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇక బన్నీ థియేటర్‌కు వచ్చాడని తెలిసిన వెంటనే అభిమానులు అక్కడికి చేరుకున్నారు.ఇక బన్నీ మాత్రం ఎప్పటిలాగే సింపుల్‌గా అభిమానులకు చేతులు ఊపుతూ లోపలికి వెళ్లిపోయాడు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. “ఇంత పెద్ద స్టార్ అయినా పిల్లల కోసం టైమ్ కేటాయించడం గొప్ప విషయం” అంటూ అభిమానులు కామెంట్లు పెట్టేస్తున్నారు.
ఇక భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఆ స్లాట్ ని హాలీవుడ్ సినిమాలు కబ్జా చేసేస్తున్నట్టే కనిపిస్తుంది.మొన్నటికి మొన్న వచ్చిన అబ్సెషన్ ఎంత సంచలనం స్ప్రుష్టించిందో చెప్పక్కర్లేదు.ఇక తాజాగా వచ్చిన ది ఒడిస్సీ ఏకంగా ఇండియాలో వంద కోట్ల పై చిలుకు వసూల్లని కొల్లగొట్టేసింది.ఇక ఇప్పటికే ఆడియన్స్ ని స్పైడర్‌మ్యాన్ సినిమాల మీద ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు.
ఉన్న క్రేజ్ 2021 డిసెంబర్ 17న విడుదలైన ‘Spider-Man: No Way Home’ ఇండియాలోనే భారీ వసూళ్లు సాధించింది మరి . అలాగే 2023 జూన్ 2న వచ్చిన ‘స్పైడర్‌మ్యాన్: Across the Spider-Verse’కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఇదే క్రమంలో జులై 30న రానున్న ఈ స్పైడర్‌మ్యాన్ కూడా అదే రేంజ్ లో వసూళ్లు కొల్లగొట్టే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత అట్లీ తో చేస్తున్న రాకా పైనే అందరి దృష్టి ఉంది. ఇక తాజాగా ఈ సినిమాని రెండు పార్టులుగా తెస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.ఈ అప్ డేటే ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఇక సినిమా ముగిసిన తర్వాత కూడా థియేటర్ బయట బన్నీ కనిపించగానే అభిమానులు మరోసారి సందడి చేశారు. సెల్ఫీలు, వీడియోలు, ఫొటోలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
also read :ఎవరికి ఏం జరిగినా చిరునే కావాలా..? ఇదేం లాజిక్..!