SSMB 29 OTT: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా పట్ల పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉంటాయి. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు(OscarAward) కూడా రావడంతో ఈయన పేరు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేసే సినిమాపై హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయడం విశేషం. ప్రస్తుత ఈ సినిమా SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
నెట్ ఫ్లిక్స్ తో డీల్ ఫిక్స్..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ(Ott) డీల్ కుదిరినట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix)భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి వీరి మధ్య ఎంత డీల్ కుదిరింది అనే ఫిగర్ మాత్రం బయటకు రాకపోయినా వందల కోట్లలోనే డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2027 మార్చి నెలలో థియేటర్లలో విడుదల కాబోతుందని సమాచారం. గతంలో కూడా RRR సినిమా ఇదే విధంగానే విడుదల చేశారు. ఇక 2027 మార్చిలో ఈ సినిమా థియేటర్లో విడుదల అయితే మే నెలలో ఓటీటీలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా..
ఇక ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ SSMB29 సినిమాతో కుదుర్చుకున్న ఈ డీల్ గురించి అధికారక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే ఇదొక అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు. ఈమెతోపాటు ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
50 కోట్లతో భారీ సెట్..
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్మిస్తున్నారని దాదాపు ఈసెట్ నిర్మాణం కోసమే 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. ఇలా మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి ఏకంగా ఒక నగరాన్ని సృష్టించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలో మహేష్ బాబు పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో అప్పుడైనా సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. ఓజీ ఆగమనం అప్పుడే.. రూమర్లను నమ్మొద్దు!