BigTV English

Unique Railway station: రెండు రాష్ట్రాలను కలిపే రైల్వే స్టేషన్.. ఎక్కడో తెలుసా?

Unique Railway station: రెండు రాష్ట్రాలను కలిపే రైల్వే స్టేషన్.. ఎక్కడో తెలుసా?

Unique Railway Station In India:  దేశ వ్యాప్తంగా 7,200 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో పలు రైల్వే స్టేషన్లు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. కొన్ని దేశ సరిహద్దులను పంచుకునే రైల్వే స్టేషన్లు ఉంటే, మరికొన్ని రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నాయి. దేశంలో రాష్ట్రాల సరిహద్దులను పంచుకునే రైల్వే స్టేషన్లు రెండు ఉన్నాయి. ఇంతకీ అవి ఏవి? ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


భవానీ మండి రైల్వే స్టేషన్

దేశంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఉన్న భవానీ మండి రైల్వే స్టేషన్. ఇదో ఆసక్తికరమైన రైల్వే స్టేషన్. ఇంకా చెప్పాలంటే అసాధారణ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ఇది రెండు రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. రాజస్థాన్,  మధ్య ప్రదేశ్ సరిహద్దులను కలుపుతుంది. ఇక్కడ టికెట్లు జారీ చేసే వ్యక్తి మధ్య ప్రదేశ్ లో కూర్చుంటాడు. ప్రయాణీకులు రాజస్థాన్ లో నిలబడి టికెట్లు కొనుక్కునేందుకు క్యూ కడుతారు. రైల్వే స్టేషన్ ఉత్తర భాగం మధ్యప్రదేశ్‌ లో ఉండటం దీనికి కారణం.దక్షిణ భాగం రాజస్థాన్‌లో ఉంది. ఈ రైల్వే స్టేషన్  సముద్ర మట్టానికి 383 మీటర్ల ఎత్తులో ఉంది. మూడు ప్లాట్‌ ఫారమ్‌ లు ఉన్నాయి. ఈ స్టేషన్ న్యూఢిల్లీ – ముంబై ప్రధాన మార్గంలో ఉంది. ఈ స్టేషన్ ఇండియన్ రైల్వేకు సంబంధించి పశ్చిమ మధ్య రైల్వే జోన్‌ లోని కోటా డివిజన్ కిందికి వస్తుంది.


రాష్ట్ర సరిహద్దులను కలిపే నవాపూర్ రైల్వే స్టేషన్

ఇక రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే మరో రైల్వే స్టేషన్ నవాపూర్ రైల్వే స్టేషన్. దేశంలో ఇది కూడా ఓ విచిత్రమైన రైల్వే స్టేషన్. ఇది మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దులో ఉంది. ఈ స్టేషన్  ఉత్తర భాగం గుజరాత్ తాపి జిల్లాలో ఉంది. స్టేషన్ దక్షిణ భాగం నందూర్బార్ జిల్లాలో ఉంది.

Read Also: ఇంకా IRCTC అకౌంట్ కు ఆధార్ లింక్ చెసుకోలేదా? టికెట్లు బుక్ చెయ్యలేరు!

సగం రైలు ఒక రాష్ట్రంలో.. మరో సగం ఇంకో రాష్ట్రంలో

నవాపూర్ రైల్వే స్టేషన్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ప్యాసింజర్ రైలు ఈ స్టేషన్ లో ఆగిన సమయంలో.. సగం రైలు  గుజరాత్‌లో ఉంటుంది, మిగిలిన సగం రైలు మహారాష్ట్రలో ఉంటుంది. ప్రయాణీకులు ఒకే ప్లాట్‌ఫారమ్‌ పై రెండు రాష్ట్రాల నుంచి  అంటే, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఒకేసారి ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాలలకు చెందిన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రైల్వే స్టేషన్ ను అలంకరించారు. గుజరాత్, మహారాష్ట్రకు చెందిన ప్రయాణికులు దీనిని తమ రైల్వే స్టేషన్ గా భావిస్తారు. మొత్తంగా దేశంలో ఈ రెండు రైల్వే స్టేషన్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి.

Read Also:  హైదరాబాద్ మెట్రోకు ఒక్క రోజులో అంత ఖర్చవుతుందా? అస్సలు నమ్మలేరు!

Related News

Trains cancelled: 68 రైళ్లు రద్దు, 24 తిరిగి ప్రారంభం.. ఆ లైన్ లో ఊరట కలిగించిన రైల్వే ప్రకటన..!

Railways TC: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!

New Visa Rules: వీసా నిబంధనలు మరింత కఠినతరం, ఇక ఆ దేశానికి వెళ్లడం అంత ఈజీ కాదు!

Special Trains: పండుగ సీజన్ కోసం మరో 150 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్!

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Big Stories

×