OG Update:సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్నికల ముందు కమిట్ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు(Hari hara Veeramallu) సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా సుజిత్ (Sujeeth)దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG)సినిమా షూటింగ్ కూడా పూర్తి అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా ఈ దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ ఏడాది చివరినా లేదా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వస్తున్నా నేపథ్యంలో నిర్మాతలు స్పందించారు.
ఆ రూమర్లను నమ్మొద్దు…
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ చూస్తే మాత్రం ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా విడుదల గురించి నిర్మాతలు స్పందిస్తూ.. ఈ సినిమా విడుదల గురించి వచ్చే రూమర్లను ఏమాత్రం నమ్మద్దని తెలిపారు.
దసరా ను టార్గెట్ చేసిన ఓజీ…
ఓజీ సినిమా సెప్టెంబర్ 25వ తేదీని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అధికారక ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. అదేవిధంగా ఒక చిన్న వీడియోని కూడా విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇలా పవన్ కళ్యాణ్ ఓజి సినిమా సెప్టెంబర్ 25వ తేదీ రాబోతుందనే విషయం తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సోలో హీరోగా వెండి తెరపై సందడి చేసి చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అభిమానులు మాత్రం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Rumours ni Nammakandi… #TheyCallHimOG arrives on Sept 25th!!🤟🏻 #OG pic.twitter.com/JPEyE3SSqe
— DVV Entertainment (@DVVMovies) July 2, 2025
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక సినిమా కూడా విడుదల కాలేదు ఇలా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సినిమాలను చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఇకపోతే జూలై 24వ తేదీ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు(జులై 3వ తేదీ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై కూడా ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చివరిగా బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.