SSMB29 : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకులలో మొదటి వినిపించే పేరు ఎస్.ఎస్ రాజమౌళి. ఏ ముహూర్తాన బాహుబలి సినిమాను రాజమౌళి మొదలుపెట్టారు కానీ అక్కడి నుంచి కేవలం ఆయన స్థాయి మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయి కూడా అమాంతం పెరిగిపోయింది.
బాహుబలి సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు మంచి గౌరవాన్ని తీసుకొచ్చింది. అక్కడితో తెలుగు సినిమా మార్కెట్ కూడా కొత్త దారి తీసుకుంది. చాలా కాలం పాటు నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ పోస్టర్ల పైన కనిపించేవి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఏసీ గదుల్లోంచి బయటకు రాని మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఏజ్ లోనే తన తండ్రి కృష్ణ గారి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అయితే కొన్ని సందర్భాలలో మహేష్ బాబు మీద కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మహేష్ బాబు ఏసీ గదుల్లో నుంచి అసలు బయటకు రాడని, షూటింగ్స్ కూడా అక్కడే చేస్తాడు అని కొన్ని వార్తలు వినిపించాయి. వాస్తవానికి మహేష్ బాబు చేసిన కొన్ని సినిమాలను బట్టి అది నిజం కాదు అని అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం స్టంట్ డబుల్ లేకుండా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలా స్టంట్సును మహేష్ బాబు రియల్ గా సందర్భంలో సుకుమార్ కూడా మాట్లాడుతూ మహేష్ ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాల్లో డూప్ లేడు అనే వార్త చాలామందికి సమాధానం అవుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నెవర్ బిఫోర్ అవుతారు
మామూలుగా హీరోలంతా ఒక దర్శకుడు తో పనిచేయడం వేరు కానీ ఎస్.ఎస్ రాజమౌళితో పనిచేయడం వేరు. తన కెరీర్లో మహేష్ బాబు పాతిక పైగా సినిమాలు చేసిన కూడా మొదటిసారి రాజమౌళి సినిమాలో ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. రాజమౌళి హీరోలు బయట పెద్దగా కనిపించరు. అని మహేష్ తనకు టైం దొరికిన ప్రతిసారి విదేశాలకు వెళ్లడం వలన ఎయిర్పోర్టులో దర్శనమిస్తూ కనిపిస్తుంటాడు. మహేష్ లుక్స్ చూసి సినిమా మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన అంచనాలు ఈ సినిమా పైన నెలకొన్నాయి.
Also Read: Movie Ticket Price : గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం… మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ 200లే