BigTV English

Movie Ticket Price : గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం… మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ 200లే

Movie Ticket Price : గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం… మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ 200లే
Advertisement

Movie Ticket Price : ప్రస్తుతం తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టికెట్ రేట్లు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఇది పెద్ద రేట్స్ కాదు అని కొంతమంది నిర్మాతలు అంటున్నారు. వారిలో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. కేవలం 300 రూపాయల ఖర్చు పెడితే మూడు గంటల టైంపాస్ ఇచ్చే ప్లేస్ నాకు చెప్పండి. అది కేవలం థియేటర్ మాత్రమే అంటుంటాడు నాగ వంశీ.


కొంతమంది సామాన్య ప్రజలు మాత్రం అంత టికెట్ రేట్లు ఉంటే సినిమాకు ఎలా వెళ్తాము ఓటిటి వచ్చిన తర్వాత చూద్దామని ఫిక్స్ అయి ఉండిపోయారు. అందుకే థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. చాలా థియేటర్స్ ఈరోజు కళ్యాణ మండపాలు అయిపోయాయి. కొన్నిచోట్ల షోస్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఇ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఒక సంచల నిర్ణయాన్ని తీసుకుంది.

గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం


ప్రతిసారి తెలుగులో భారీ బడ్జెట్ సినిమా విడుదలైనప్పుడు ప్రభుత్వానికి టికెట్ రేట్లు హైక్ కోసం ఆయా నిర్మాతలు రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. ఆ తర్వాత కొంతమంది సినిమా ప్రముఖులు వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కొంత హైక్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రతి సినిమాకి కూడా హైక్ అడగడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ తరుణంలో కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్ లో కూడా టికెట్ ధర 200 మించకుండా ఉండాలని జీవో జారీ చేసింది. దీంతో ఎంత భారీ బడ్జెట మూవీ అయినా.. సరే.. ఎంత పెద్ద మల్టీప్లెక్స్ అయినా సరే.. టికెట్ ధర 200 రూపాయలే ఉంటుంది.

ఇక్కడ కూడా మార్పు జరగాలి 

ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అదే నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి అన్నది కొంతమంది అభిప్రాయం. ముఖ్యంగా సినిమా విడుదలైన 30 రోజుల్లోపే ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సినిమా కోసం 300 రూపాయలు పెట్టే బదులు ఒక ఓటిటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బోలెడన్ని సినిమాలను చూడొచ్చోని మైండ్ సెట్ అందరికీ వచ్చేసింది. ఈ తరుణంలో ఎవరో థియేటర్కు రావడానికి రెడీగా ఉండట్లేదు. ఏదో పెద్ద హీరో సినిమా విడుదలయితే గాని థియేటర్స్ కూడా ఫిల్ అవ్వని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. మొత్తానికి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంతమేరకు పరిశ్రమకు ప్లస్ గా మారుతుంది.

Also Read : Singer Lakshmi : పుష్ప 2లో ‘తిన్నతిరం పడేతలే’ సింగర్ లక్ష్మీ పాడింది.. ఆ సాంగ్ ఏంటో తెలుసా?

Related News

Renu Desai: నా పిల్లలను వదిలేసి.. సన్యాసం తీసుకుంటున్నా.. కానీ,

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!

Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Big Stories

×