Athadu Re Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్(Re Release) ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరి సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి రీ రిలీజ్ సమయంలో కూడా భారీ కలెక్షన్లను రాబట్టాయి. ఇకపోతే జూలై నెలలో కూడా ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఆగస్టు నెలలో కూడా పెద్ద ఎత్తున స్టార్ హీరోల సినిమాలు తిరిగి విడుదలకు సిద్ధమవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పుట్టినరోజు (Birthday)సందర్భంగా ఆయన హీరోగా నటించిన అతడు(Athadu) సినిమాని తిరిగి విడుదల చేయబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మురళీమోహన్ నిర్మాణంలో మహేష్ బాబు, త్రిష (Trisha)జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో వెండితెరపై కంటే కూడా బుల్లితెరపై మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
పుట్టినరోజు స్పెషల్…
ఇక ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని తిరిగి మరోసారి 4k వర్షన్ లో విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా రీ రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఏకంగా కోటి 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసే సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో రీ రిలీజ్ కోసం డబ్బు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ పట్ల పెద్దగా బజ్ కూడా లేదు.
భారీ అంచనాలతో రీ రిలీజ్…
ఇలాంటి తరుణంలో ఈ సినిమాని ఏకంగా 1.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఖర్చులు అన్నీ కలుపుకొని సుమారు 3.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం సినిమాకు ఎలాంటి బజ్ లేని నేపథ్యంలో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అనేది కష్టతరంగానే అనిపిస్తుంది. ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమా కూడా మే 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాబట్ట లేకపోయింది.
SSMB 29 నుంచి అప్డేట్..
ఇక అతడు సినిమాపై ఎలాంటి బజ్ లేకపోయినా ఏకంగా 3.5 కోట్ల రూపాయల టార్గెట్ అంటే ఈ టార్గెట్ చేరుకోవడం కష్టమేనని స్పష్టమవుతుంది.. మరి ఈ కొద్ది రోజుల వ్యవధిలో చిత్ర బృందం ప్రమోషన్లను నిర్వహిస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తే తప్ప ఈ సినిమా అనుకున్న టార్గెట్ చేరుకోలేదని చెప్పాలి. ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న SSMB 29 నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా అయినా రాజమౌళి సినిమాకు సంబంధించి అప్డేట్ విడుదల చేస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. మొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: Kingdom OTT : కింగ్‌డం ఓటీటీ రైట్స్… ఫైనల్‌గా డీల్ ఇక్కడ ఆగింది