Kingdom OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కూడా ఒకటి. ఈ నిర్మాణ సంస్థ నుంచి నాగ వంశీ(Nagavamshi) ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చారు. ఇక త్వరలోనే ఈయన నిర్మాణంలో తెరకెక్కిన కింగ్ డం (King Dom) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) భాగ్యశ్రీ (Bhagya Sree)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జులై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
నెట్ ఫ్లిక్స్ చేతికి కింగ్ డం…
ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగవంశీ తన సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) రూ.50 కోట్లకు దక్కించుకున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఓటీటీ డీల్ చాలా రోజుల క్రితమే ఫిక్స్ అయిందని తెలుస్తోంది కానీ ఇటీవల కాలంలో ఈ సినిమా వరసగా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
రూ.50 కోట్లకు ఫైనల్..
ఇలా తరచు వాయిదా పడుతున్న నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ తో కుదుర్చుకున్న డీల్ విషయంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని తెలుస్తుంది. ఇలా తరచూ వాయిదా పడిన నేపథ్యంలో ఈ సినిమా డీల్ తగ్గి 50 కోట్లకు ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందని సమాచారం. ఇంకా ఈ విషయాల గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఆగస్టు 27 తేదీ మరొక సినిమా కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా ఆగస్ట్ 27న విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్టు సమాచారం.
నెట్ ఫ్లిక్స్ చేతికి మాస్ జాతర…
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ రూ.20 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక నెల వ్యవధిలోగా నాగ వంశీ నుంచి మూడు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఎన్టీఆర్ హీరోగా నటించిన వార్ 2 సినిమా తెలుగు హక్కులను కూడా ఈయన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా నెల వ్యవధిలోనే మూడు భారీ బడ్జెట్ సినిమాలతో నాగ వంశీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక కింగ్ డం విషయానికొస్తే ఈ సినిమా పైనే విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే హిందీలో సామ్రాజ్యం అనే పేరిట విడుదల కానుంది.
Also Read: AM Ratnam: అందుకే గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. ఏ.ఎం.రత్నం కామెంట్స్ వైరల్!