BigTV English

Star Actress: బ్యాడ్ లక్.. ఈ హీరోయిన్లకు కలసి రాని రీ ఎంట్రీ?

Star Actress: బ్యాడ్ లక్.. ఈ హీరోయిన్లకు కలసి రాని రీ ఎంట్రీ?

Star Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోలు కంటిన్యూగా సినిమాలు చేస్తున్న హీరోయిన్లు మాత్రం పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇస్తూ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్(Second Innings) ప్రారంభిస్తు ఉంటారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సెలబ్రిటీలో మంచి సక్సెస్ అందుకోగా మరి కొంత మంది సెకండ్ ఇన్నింగ్స్ లో తీవ్ర నిరాశను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇటీవల ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది హీరోయిన్లకు రీ ఎంట్రీ సినిమాలు కాస్త నిరాశ పరిచయని చెప్పాలి. మరి రీఎంట్రీ ఇచ్చిన ఆ హీరోయిన్స్ ఎవరు ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే…


లయ..

ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న లయ(Laya) పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. విదేశాలలో స్థిరపడిన ఈమె ఇటీవల సినిమాలపై ఆసక్తితో తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు(Thammudu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో నితిన్ అక్క పాత్రలో లయ నటించినప్పటికీ ఈ సినిమా లయ రీ ఎంట్రీ కి పెద్దగా ఉపయోగపడలేదని చెప్పాలి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది.


జెనీలియా..

సొంతం అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జెనీలియా(Genelia) అనంతరం బాయ్స్, బొమ్మరిల్లు, రెడీ, ఢీ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె కెరియర్ కూడా మంచి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. దాదాపు 13 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా ఇటీవల కిరీటి రెడ్డి హీరోగా నటించిన  జూనియర్ (Junior)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో జెనీలియా పాత్ర మంచిగానే ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది.

అన్షు…

నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాతో ప్రేక్షకులకు ఆకట్టుకున్న అన్షు అనంతరం ప్రభాస్ తో కలిసి రాఘవేంద్ర సినిమాలో నటించారు. అయితే తెలుగులో పెద్దగా సినిమాలలో నటించని ఈమె సుమారు 22 సంవత్సరాల తర్వాత తిరిగి మజాకా (Majaka)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎన్నో అంచనాల నడుమ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఈ సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయన చెప్పాలి. ఇలా రీ ఎంట్రీ సినిమాలతో నిరాశ ఎదుర్కొన్న వీరికి తదుపరి ఎలాంటి సినిమాలలో అవకాశాలు వస్తాయి అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Ustad Bhagath Singh: వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఉస్తాద్ టీమ్…చర్యలు తప్పవంటూ?

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×