Cheating in startup companies: స్టార్టప్.. స్టార్టప్.. స్టార్టప్. చదువు పూర్తికాగానే.. ఓ కంపెనీ ఏర్పాటుచేయాలి.. సొంతంగా మనకాళ్లపై మనం నిలబడాలి. అవసరమైతే పలువురికి ఉపాధి కల్పించాలన్నదే టార్గెట్‌గా పనిచేస్తున్నారు నేటి యువత. అందుకోసం ఎవరైనా ఫండింగ్ చేస్తారా అంటూ తెలిసినవారితో పాటు తెలియనివారిని కూడా ఆశ్రయిస్తారు. ఇక్కడ వారి ఆశనే.. అక్రమార్కులు బలహీనంగా మలుచుకుని కావాల్సినంత దోచుకుంటున్నారు. రీసెంట్ టైంలో ఇలాంటి ఫ్రాడ్ లు చాలానే వెలుగుచూశాయి. అందులో మేం చెప్పేది మరోకటి.
స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం పేరుతో చీటింగ్
ఎన్నో ఆశలతో స్టార్టప్ కంపెనీలను స్థాపిస్తారు. వారి కలలు నిజం చేసుకోవాలని పెట్టుబడుల కోసం ఎదురు చూస్తారు. ఈ పెట్టుబడులను ఆశగా చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి కొన్ని సంస్థలు. స్టార్టప్ కంపెనీలను టార్గెట్ చేస్తూ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతుంది ఓ సంస్థ. ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్స్ సైతం మోసపోతున్నారు. ఈ తరహాలో ఢిల్లీకి చెందిన ఫాక్స్ హాగ్ సంస్థ మోసాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా వందలాది మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు కాజేశారు.
ఢిల్లీకి చెందిన తరుణ్ పోద్దార్
ఇక్కడ మీరు చూస్తున్న పర్సన్ తరుణ్ పోద్దార్. ఢిల్లీకి చెందిన తరుణ్ పోద్దార్ ఫాక్స్ హాగ్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు. దేశ.. విదేశాల్లో కంపెనీకి సంస్థ కార్యాలయాలు ఉన్నాయిని నమ్మిస్తున్నాడు. యువ, ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల యజమానులు.. వారి వివరాలు కొన్ని జెన్యూన్ గా పెట్టుబడులు పెట్టే సంస్థల వెబ్ సైట్‌ల నుండి డేటా సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన డేటాలోని వివరాల ఆధారంగా వారికి పెట్టుబడులు పెడతామంటూ మెయిల్ చేస్తున్నారు. ఈ తరహాలోనే హైదరాబాద్ కి చెందిన ఇద్దరు స్టార్టప్ కంపెని యజమానులను ఫాక్స్ హాగ్ సంస్థ మోసం చేసింది.
ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామంటూ మోసాలు
వెబ్ సైట్‌ల నుంచి సేకరించిన స్టార్టప్ కంపెనీల యజమానుల వివరాల ద్వారా వారికి వీడియో కాల్స్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు. అనంతరం షార్ట్ లిస్టెడ్‌లో సెలెక్ట్ అయ్యారని.. ఇన్వెస్ట్ మెంట్ అగ్రిమెంట్ చేసి నమ్మిస్తారు. 4 నుండి 5 కోట్ల వరకు పెట్టుబడులు ఇస్తామంటారు. అందుకు గాను తమ కంపెనీలో 25 నుంచి 30 శాతం వరకు స్టేక్ అడుగుతారు. మీ స్టార్టప్ కంపెనీలకు సీఏ, సీఎస్, లీగట్ టీమ్ ఉన్నారా అని అడుగుతారు.. లేకపోతే మిగితా ప్రాసెస్ కోసం తాము అవన్నీ అరేంజ్ చేస్తామని 50 శాతం మాత్రమే తాము ఫీజులు చెల్లించాలని మభ్యపెడుతారు. వివిధ కంపెనీ పేర్లతో డమ్మీ నకిలీ వెబ్ సైట్ లను సృష్టించి వాటి ద్వారా ప్రాసెస్ చేస్తామని నమ్మిస్తారు. ఇక్కడ దివాన్ అసోసియేట్స్ అనే సంస్థ ద్వారా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చేస్తామంటారు. అందుకు 50 శాతం ఫీజులు పే చేయమంటారు. కానీ ఈ సంస్థ కూడా ఫాక్ హాగ్ సంస్థ ఎండీ తరుణ్ పోద్దార్ దే. ఈ సంస్థకు రిజిస్ట్రేషన్ లేదు.. ఇది బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థ.
పెట్టుబడులు రాకపోవడంతో మోసపోయామని..
ఇన్వెస్ట్ మెంట్‌ను ఫారిన్ ఫండ్స్ రూపంలో పెడుతామంటారు తరుణ్ పోద్దార్. ఫారిన్ ఫండ్స్ కాబట్టి RBI చార్జీలు, ప్రభుత్వ ఫీజులు.. ఇతర డాక్యుమెంటేషన్ చార్జీల పేరుతో లక్షల రూపాయల వరకు దోచేస్తారు. అందుకు RBI లోగోతో ఉన్న రిసిప్ట్ లతో పాటు.. నకిలీ ఇన్ వాయిస్‌లను సైతం మెయిల్ చేస్తారు. హైదారాబాద్‌కి చెందిన సుమారు 10 మంది బాధితుల నుండి సుమారు కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారు. అలా రీసెంంట్‌గా ఇద్దరు స్టార్టప్ కంపెనీల యజమానులకు 4 నుంచి 5 కోట్లు తమ కంపెనీలలో పెట్టుబడులు పెడుతామంటూ నమ్మించారు. వీరి వద్ద నుండి సుమారు 10 నుంచి 20 లక్షల వరకు లాగారు. చివరకు పెట్టుబడులు రాకపోవడంతో పాటు వాటి గురించి అడిగినా..ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సెల్ అయిందని చెబుతారు. తమ డబ్బు తిరిగి అడిగినా లీగల్‌గా ముందుకు వెళ్లినా.. బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఖైరతాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు, కేసు నమోదు
తమకు న్యాయం చేయాలంటూ స్టార్టప్ కంపెనీల యజమానులు ఖైరతాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. హితేష్ అనే బాధితుడి పిర్యాదు ఆధారంగా ఖైరతాబాద్ పోలీసులు ఫాక్స్ హాగ్ సంస్థ ఎండీ తరుణ్ పోద్దార్ తో పాటు సంస్థ డైరెక్టర్లు శకుంతల, ప్రియా గుప్తాల పై కేసు నమోదు చేశారు. ఫాక్స్ హాగ్ ఎండీ తరుణ్ కుమార్ పోద్దార్ పై గతంలో మోసం చేసిన కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. వారి కోసం పోలీసుల ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. అయితే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ నుండి వెళ్లిన పోలీసులకు సహకరించకుండా నిందితులకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: గోండ్ కటిరా తింటున్నారా..? అయితే ఇది మీ కోసమే..
మోసపోతున్న యువపారిశ్రామికవేత్తలు
ఇదిలా ఉంటే తమ ఫాక్స్ హాగ్ సంస్థకు 100 నుండి 110 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని సంస్థ ఎండీ తరుణ్ పోద్దార్ ప్రకటించారు. కానీ ఐటీలో మాత్రం 25 లక్షలకు మాత్రమే చూపిస్తూ ట్యాక్స్ చెల్లించారు. ఇలా కూడా ఫేక్ ప్రచారం చేసుకున్నట్లు తరుణ్ పోద్దార్ పై ఆరోపణలు ఉన్నాయి. యూఎస్‌లో కంపెనీ కార్యాలయం ఉందని నమ్మించారు. RBI లైసెన్స్ లేకుండా ఫైనాన్సియల్ బ్యాంకిగ్ సేవలు అందిస్తామని వెబ్ సైట్‌లో ప్రమోట్ చేస్తూ నమ్మిస్తున్నారు. అసలు RBI అనుమతి, సెబి అనుమతి లేకుండా సంస్థ ఐపీవోకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. అయినా సంస్థ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికైనా ఈ ఫాక్స్ హాగ్ సంస్థ పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.తరుణ్ పోద్దార్ కు అవార్డులు రావడం, మీడియా ప్రమోషన్ చూసి బాధితులు మోసపోతున్నారు.