BigTV English

Star Singer : మూడో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ పాప్ సింగర్.. ఏం పేరు పెట్టారో తెలుసా?

Star Singer : మూడో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ పాప్ సింగర్.. ఏం పేరు పెట్టారో తెలుసా?

Star Singer :పాప్ సింగర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రిహన్న (Rihanna ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన అద్భుతమైన గాత్రంతో యువతను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె తాజాగా తన మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 13వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు రిహన్న తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాదు తన కూతురి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. ఇక పలువురు సెలబ్రిటీలు రిహన్న దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


బిడ్డకి ఏం పేరు పెట్టారంటే?

తాజాగా తనకు పుట్టిన పాపకు ‘రాకీ ఐరిష్ మేయర్స్’ అని నామకరణం చేసినట్లు రిహన్న తెలిపింది. ఇదివరకే రిహన్న – రాకీ దంపతులకు ఇద్దరూ కొడుకులు జన్మించిన విషయం తెలిసిందే. మొదటి కొడుకుకి RZA అథెల్ స్టన్ మేయర్స్ అని నామకరణం చేయగా.. రెండవ బాబుకి రైయట్ రోజ్ మేయర్స్ అని నామకరణం చేశారు. అలా ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలను కలిగి ఉన్న వీరు ఇప్పుడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ALSO READ:Tollywood: తల్లి కాబోతున్న హీరోయిన్ చెల్లి.. మరి అక్క సంగతేంటి? బేబీ బంప్ ఫోటోలు వైరల్!


రిహన్న – రాకీ రిలేషన్షిప్..

రిహన్న – రాకీ రిలేషన్షిప్ విషయానికి వస్తే.. 2019లోనే ప్రేమలో పడ్డ వీరు.. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏఎస్ఏపీ రాకీ అమెరికన్ రాపర్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్నారు. 2021లో వివాహం చేసుకున్న వీరు..2022లో మొదటి కొడుకుకి జన్మనిచ్చారు. అలాగే 2023లో మరో కొడుకుకి జన్మనిచ్చిన ఈమె.. ఇప్పుడు ఒక కూతురికి జన్మనిచ్చింది.

రిహన్న వ్యక్తిగత జీవితం..

రిహన్న వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. రాకీ ఈమె మొదటి భర్త కాదు. ఇప్పటికే ఈమెకు రెండు వివాహాలు జరిగి విడాకులైనట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. 2008లో క్రిస్ బౌన్ తో ఏడడుగులు వేసిన ఈమె.. 2009లోనే విడిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత హసన్ జమీల్ అనే వ్యక్తితో 2017లో ఏడడుగులు వేసింది. 2020లో వీరిద్దరూ విడిపోయారు. ఇక 2019లో రాకీతో రిలేషన్ లో ఉన్న రిహన్న 2021లో వివాహం చేసుకొని.. ప్రస్తుతం అతనితోనే జీవితాన్ని కొనసాగిస్తుంది.రిహన్న గాయకురాలు మాత్రమే కాదు నటి , వ్యాపారవేత్త కూడా.. ఈమె 1988 ఫిబ్రవరి 20న బార్బడోస్లో జన్మించింది. ఈమె పూర్తి పేరు రాబిన్ రిహాన్న ఫెంటీ. సంగీత బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. కళాత్మక ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. అటు సంగీతం ఇటు ఫ్యాషన్ రెండింటిలో కూడా సత్తా చాటుతున్న రిహన్న అన్ని కాలాలలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే పాప్ సింగర్ గా పేరు సొంతం చేసుకుంది.

Related News

OG Movie : ఓజీ ఎఫెక్ట్… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఉరికించి కొట్టారు!

Tollywood: తల్లి కాబోతున్న హీరోయిన్ చెల్లి.. మరి అక్క సంగతేంటి? బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Pushpa 3: దేవుడి సన్నిధిలో పుష్ప3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్!

Sai Pallavi: ట్రోల్స్ మధ్య ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్న సాయి పల్లవి!

OG: ఓజీ విషయంలో త్రివిక్రమ్ సైలెన్స్.. కారణం ఏంటి?

OG Twitter Review: ఓజి ట్విట్టర్ రివ్యూ, హిట్ కొట్టేసినట్లేనా?

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

Big Stories

×