BigTV English

Tollywood: తల్లి కాబోతున్న హీరోయిన్ చెల్లి.. మరి అక్క సంగతేంటి? బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Tollywood: తల్లి కాబోతున్న హీరోయిన్ చెల్లి.. మరి అక్క సంగతేంటి? బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Tollywood:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది సెలబ్రిటీలు అలా పెళ్లిళ్లు చేసుకొని.. ఇలా తల్లిదండ్రులు అవుతుంటే.. మరికొంతమంది పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా ప్రెగ్నెన్సీ ప్రకటన చెయ్యకపోయేసరికి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది హీరోయిన్లు మాత్రం పెళ్లిళ్లు చేసుకొని శుభవార్త తెలుపకపోయినా.. వారి చెల్లెలు వివాహం చేసుకొని శుభవార్తలు చెప్పడం ఆశ్చర్యంగా మారింది. ఈ క్రమంలోనే హీరోయిన్ వితికా షేరు కూడా తన చెల్లెలు తల్లి కాబోతోంది అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. మరి మీరు ఎప్పుడు? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


గృహప్రవేశం చేసిన వితిక – వరుణ్..

ప్రముఖ హీరోయిన్ వితికా షేరు 2016లో ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ తో ఏడడుగులు వేసింది.. ఇకపోతే వివాహం అనంతరం శుభవార్త చెబుతారని అభిమానులు ఎన్నో కలలు కన్నారు. కానీ ఈ జంట ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారే కానీ అందుకు సంబంధించిన శుభవార్తను మాత్రం తెలియజేయలేదు. దీనికి తోడు వితిక షేరు – వరుణ్ సందేశ్ ఇటీవల నూతన గృహప్రవేశం కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా.. ఇలా గృహప్రవేశం చేయడంతో అభిమానులు కూడా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు మరి ఆ శుభవార్త ఎప్పుడు చెబుతారు అని అడుగుతుండగా.. సడన్గా వితికా తన చెల్లెలు కృతిక శుభవార్త తెలియజేసింది.

తల్లి కాబోతున్న వితికా చెల్లెలు..


అయితే ఈ విషయాన్ని కూడా వితికా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ శుభవార్తను తెలియజేసింది. బేబీ బంప్ తో ఉన్న కృతిక తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను వితికా షేర్ చేస్తూ..” తన చెల్లెలు కృతిక త్వరలో అమ్మ కాబోతోంది” అంటూ పోస్ట్ పెట్టింది ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు వితికాతో పాటు కృతిక – కృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులు మాత్రం చెల్లి ప్రెగ్నెంట్ అయింది ఓకే మరి నువ్వు ఎప్పుడు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కృతిక బేబీ బంప్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

చెల్లి పెళ్లిని దగ్గరుండి మరీ జరిపించిన వితిక..

కృతిక – కృష్ణల వివాహ విషయానికొస్తే.. 2022లో వీరి వివాహం జరిగింది. చెల్లి పెళ్లిని తన చేతులు మీదుగా దగ్గరుండి మరీ జరిపించింది వితిక. ఇప్పుడు కృతిక తల్లి కాబోతుండడంతో వితిక ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. వితికా విషయానికి వస్తే.. బాలనటిగా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్ , కన్నడ సినిమాలలో కూడా నటించిన వితిక.. కొన్ని సినిమాలలో సహాయ పాత్రలు కూడా పోషించింది.

ALSO READ:Pushpa 3: దేవుడి సన్నిధిలో పుష్ప3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్!

పెద్దల సమక్షంలో 2016 లోనే పెళ్లి..

అదే సమయంలో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి 2016 ఆగస్టు 19న పెద్దల అనుమతితో వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది. ఇకపోతే వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం మొదలయ్యి మనసులు కలిసాయి. అలా పెద్దల అనుమతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు .ఇక పెళ్లయి ఇన్నేళ్లయినా ఈ జంట మాత్రం తల్లిదండ్రులు కాకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

OG Movie : ఓజీ ఎఫెక్ట్… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఉరికించి కొట్టారు!

Star Singer : మూడో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ పాప్ సింగర్.. ఏం పేరు పెట్టారో తెలుసా?

Pushpa 3: దేవుడి సన్నిధిలో పుష్ప3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్!

Sai Pallavi: ట్రోల్స్ మధ్య ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్న సాయి పల్లవి!

OG: ఓజీ విషయంలో త్రివిక్రమ్ సైలెన్స్.. కారణం ఏంటి?

OG Twitter Review: ఓజి ట్విట్టర్ రివ్యూ, హిట్ కొట్టేసినట్లేనా?

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

Big Stories

×