Su from so : ఇటీవల కాలంలో తెలుగు సినిమాల కన్నా వేరే భాషల నుంచి వచ్చిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. తాజాగా మరో కన్నడ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా కేవలం ఒక్క రోజులోనే కోట్లు కొల్లగొట్టేసింది. కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ‘సు ఫ్రమ్ సో’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిన్న తెలుగులో రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. మొదటి షో తోనే కామెడీ మూవీ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక్కరోజులో ఇన్ని కోట్లు రాబట్టడం మామూలు విషయం కాదు.. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు ఒకసారి తెలుసుకుందాం..
‘సు ఫ్రమ్ సో’ ఫస్ట్ డే కలెక్షన్స్…
కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షనీల్ గౌతమ్, సంద్య అరకెరె ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్.బి.శెట్టి , శశిధర్ శెట్టి బరోడా, రవిరాయ్ కలస నిర్మించారు. ఆసక్తికరమైన కథ, కథనంతో నిండిన ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల పండగను అందించిందని నిన్న వచ్చిన రివ్యులను చూస్తే ఎవ్వరికైన అర్థమవుతుంది. కన్నడలో బ్లాక్ బాస్టర్ హిట్.. అదే విధంగా తెలుగులో కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. జూలై 25 న కన్నడలో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీని కేవలం 5 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇప్పటికీ 60 కోట్లకు పై వసూల్ చేసింది.. తెలుగు లో కూడా పాజిటివ్ గా మౌత్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చినట్లు తెలుస్తుంది. అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు గా 5 కోట్లు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై మైత్రి మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..
Also Read: రాజా రవీంద్రలో ఈ టాలెంట్ ఉందా..? అలా ఎత్తేశాడేంటి.?
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఓ గ్రామంలో ఓ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ అశోక్ (జెపి తుమినాడ్) ఫుల్లుగా తాగి వెళ్తుండగా ఒక అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుండటాన్ని గమనించి నేత్రానందం పొందుతాడు. అది గమనించిన జనాలు అశోక్‌ని కొట్టాలని ప్రయత్నిస్తారు. అయితే అతను దయ్యం పట్టినట్టు హడావిడి చేసి పడిపోతాడు. ఇది నమ్మిన ఊరు జనాలు.. మరింతగా ఆ వార్తను ప్రచారం చేస్తారు. ఆ టైంకి ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్) ఊర్లో ఉండడు. దీంతో మిగిలిన జనాలు ఓ పూజారిని తీసుకొచ్చి అశోక్‌లో ఉన్న దయ్యాన్ని వదలగొట్టాలని చూస్తారు.ఈ క్రమంలో అశోక్‌లో ఉన్న ఆత్మను కనుగొనడానికి ఆ పూజారి ప్రయత్నించగా అశోక్ సరదాగా తన పేరు కాంచన అని పేరు చెబుతాడు. కానీ జనాలు అది సులోచన అని ప్రచారం చేస్తారు. తర్వాత ఆ దయ్యం వాళ్లని ఎలా ఆడుకుంటుంది అన్నది స్టోరీ.. కొంచెం అటూ ఇటూ గా పొరపాట్లు జరిగినా సినిమా కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వీకెండ్ ఈ సినిమానే ఎక్కువగా వినిపించడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేస్తున్నారు.