BigTV English

Su From So Trailer : కన్నడ హారర్ మూవీ తెలుగులోకి వచ్చేస్తోంది.. ట్రైలర్‌తోనే హిట్ కళ కనిపిస్తోంది..

Su From So Trailer : కన్నడ హారర్ మూవీ తెలుగులోకి వచ్చేస్తోంది.. ట్రైలర్‌తోనే హిట్ కళ కనిపిస్తోంది..

Su From So Trailer : ఈ మధ్యకాలంలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు తెలుగులో మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమాలో తెలుగు సినిమాలను మించి క్రేజ్ ని సంపాదించుకుంటున్నాయి. తాజాగా మరో కన్నడ చిత్రం తెలుగులోకి రాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దీని పేరు ‘సు ఫ్రమ్ సో’.. ఇటీవలే ఈ మూవీ కన్నడలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంది. దీన్ని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


‘సు ఫ్రమ్ సో’ ట్రైలర్.. 

కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షనీల్‌ గౌతమ్, సంద్య అరకెరె ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌.బి.శెట్టి , శశిధర్‌ శెట్టి బరోడా, రవిరాయ్‌ కలస నిర్మించారు. ఆసక్తికరమైన కథ, కథనంతో నిండిన ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల పండగను అందింస్తుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ హారర్ కామెడీ మూవీ. అసలు విషయానికొస్తే.. తీర ప్రాంతంలో ఉండే ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తిరుగుతుంటాడు. అతడిని సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకార్లు ఊరంతటా వ్యాపిస్తాయి. ఆ తరువాత ఊరిలో ఎటువంటి పరిస్థితులను జనాలు ఎదుర్కొన్నారు అనేది సినిమా స్టోరీ.. ఊరిలో జరిగే కొన్ని ఊహించని సంఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఓవరల్‌గా ‘సు ఫ్రమ్ సో’ ట్రైలర్ ఫన్నీగా ఉంటూను హారర్ సీన్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేసింది.


Also Read : సీరియల్లో సైలెంట్.. బయట యమ స్పీడు.. ఇదిగో ప్రూఫ్..

మైత్రి మేకర్స్ ఖాతాలో మరో హిట్…

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. కేవలం తెలుగు సినిమాలను మాత్రమే కాదు వేరే భాషల్లోని చిత్రాలను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తుంటారు. ఇప్పటివరకు ఈ నిర్మాణ సంస్థ లో వచ్చిన సినిమాలు కొన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో కన్నడ హారర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. దెయ్యం స్టోరీతో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను మంచి రెస్పాన్స్ వస్తుంది. మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.. ఈ చిత్రాన్ని జేపీ తుమినాడ్ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. ఈ మూవీ ఆగస్టు 8న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.. ఈ మూవీ గనక హిట్ అయితే మైత్రి మూవీ ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్లే.. ప్రస్తుత ఈ నిర్మాణ సంస్థలో రెండు మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×