Illu Illaalu Pillalu Srivalli : బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ యాక్టర్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. కొందరేమో రీల్స్, యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.. స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ తో దూసుకుతున్న సీరియల్స్ లలో రీసెంట్ వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. కుటుంబ విలువల గురించి ఒక తండ్రి తన కొడుకులకు ఎలా చెప్తాడు? తన ఫ్యామిలీని ఎలా ముందుకు నడిపిస్తాడు? అనే స్టోరీతో సీరియల్ సాగుతుంది.. ఈ సీరియల్ లో అందరూ ఒకతాటిపై నిలబడితే.. పెత్తనం కోసం పోరాడే పెద్ద కోడలు పాత్రలో శ్రీవల్లి నటిస్తుంది. ఈమె అసలు పేరు త్రివేణి.. తాజాగా ఈ అమ్మడు వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది.
చూడ్డానికి సైలెంట్.. కోరికలు వైలెంట్..
శ్రీవల్లి పాత్రలో త్రివేణి నటిస్తున్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అంతేకాదండోయ్.. పలు డాన్స్ వీడియోలను, కొన్ని రూల్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ట్రెడిషనల్ లుక్ లో డ్రెస్ లో కనిపించిన ఈ అమ్మడు.. ఒక వ్యక్తి ఎవరో కాఫీ తాగుదామా అని అడుగుతాడు. కానీ ఈమె మాత్రం అమ్మాయిలు ఎప్పుడు కాఫీనే తాగుతారా? సరదాగా బయటికి వెళ్లి మందు తాగొద్దామా అని అంటుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..
Also Read: కామెడీ రాదు.. యోగిబాబు పరువు తీసిన బ్రహ్మీ..
త్రివేణి సీరియల్స్ విషయానికొస్తే..
జెమినీ టీవీలో ప్రసారం అయిన సుందరి సీరియల్ హీరోయిన్ త్రివేణి. ఈమె పూర్తి పేరు త్రివేణి యాదవ్ . జీ తెలుగులో ముత్యాల ముగ్గు సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా చేసింది. సప్తగిరి ఎల్ ఎల్ బీ, మిడిల్ క్లాస్ మెమొరీస్, క్రాక్, కేసీఆర్ బయోపిక్ తదితర చిత్రాల్లో నటించారు. అంతేకాదు.. ఆ మధ్య జబర్దస్త్, ఢీ షో వంటి షోలలో కూడా మెరిసింది.. ఈమె స్వస్థలం గుంటూరు అయిన సెటిల్ మాత్రం వైజాగ్ లో.. వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీలో తన డిగ్రీని పూర్తి చేసింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇలా బుల్లితెరతో పాటు వెండితెరపైన మెరుస్తోంది.. ఈమెకు ఒక్కరోజుకు 15 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మొత్తానికి సీరియల్ ద్వారా లక్షలు సంపాదిస్తుంది. ఈ మధ్య ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయ్యింది. ఈ సీరియల్ సక్సెస్ అవ్వడంతో ఈమె నెక్స్ట్ సీరియల్స్ కు రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సీరియల్లో పద్దతిగా ఉంటున్న ఈమె, బయట మాత్రం చాలా హాట్ గా కనిపిస్తుంది. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువే.. ఇప్పుడు ఈ వీడియోను చూసి నీలో ఈ టాలెంట్ కూడా ఉంది అని ఆశ్చర్యపోతున్నారు.
?igsh=b2dxcXY0MnNmdDAw