Sudha Kongara: సినిమా ప్లాప్ అయితే ఇవ్వాల్సిన పారితోషికాలు ఎగ్గొట్టడం ఇక్కడ కామన్. దానికి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.కాని మేము తీసిన సినిమా వందకోట్లు కొల్లగొట్టింది అని ఊదరగొట్టిన మేకర్స్ తీరా డైరెక్టర్ కి డబ్బులు ఇవ్వకుండా ఎగ నామం పెడితే ఎలా ఉంటుంది.అదిగో అచ్చం ఓ క్రేజీ ఇన్సిడెంట్ ఇపుడు కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది. అవును …నాకు పూర్తి డబ్బులు ఇవ్వలేదు మొర్రో అంటూ పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర బాకీ పడ్డ డబ్బుల కోసం మద్రాస్ హాయ్ కోర్ట్ మెట్లెక్కడం ట్రేడ్ వర్గాలకి పెద్ద షాక్ ఇస్తుంది.
విషయంలోకి వెళ్తే డాన్ పిక్చర్స్ పై శివ కార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన పరాశక్తి అనే సినిమాని సుధా కొంగర డైరెక్ట్ చేసిన సంగతి తెల్సిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడు పొంగల్ బరిలో దిగి తమిళ నాట సాలి వసూల్లని చూసిందని,పై పెచ్చు సినిమా ఏకంగా వందల కోట్ల క్లబ్ లో చేరిందని కాలర్ ఎగరేసి మరీ నెట్టింట్లో డబ్బా కొట్టుకుంది డాన్ పిక్చర్స్.దీంతో సోషల్ మీడియాలో దీనికొచ్చిన హైప్ తో చూడని వారంతా ఒటీటీలో చూడడానికి ఎగబడటంతో సినిమా రికార్డు సంఖ్యలో డిజిటల్ వ్యూస్ రాబడుతుంది.అయితే సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పుకున్న మేకర్స్ మాత్రం సుధా కొంగరకి ఒప్పుకున్నా మొత్తాన్ని ఇవ్వకుండా మొహం చాటేయడం ఇక్కడ పెద్ద ట్విస్ట్.
ఈ ఏడాది 2026 జనవరిలో సంక్రాంతి బరిలో దిగిన ‘పరాశక్తి’ అనే పొలిటికల్ డ్రామా థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హీరో శివకార్తికేయన్ మార్కెట్ స్టామినాను వాడుకుంటూ, కేవలం 11 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని నిర్మాణ సంస్థ ‘డాన్ పిక్చర్స్’ కాలర్ ఎగరేసి మరీ సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకుంది. ఈ దెబ్బతో సినిమా థియేట్రికల్ రన్ ముగిసి, ఇప్పటికే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతూ సక్సెస్‌ఫుల్‌గా డిజిటల్ వ్యూస్ రాబడుతోంది. సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందని ప్రచారం చేసుకున్న మేకర్స్, ఆ సక్సెస్ వెనుకున్న మెదడు.. అంటే దర్శకురాలు సుధా కొంగరకు మాత్రం మాట్లాడిన మొత్తాన్ని సెటిల్ చేయకుండా ముఖం చాటేయడం ఇక్కడ అసలు ట్విస్ట్.
అనుకున్న దాని ప్రకారం ‘పరాశక్తి’కి సుధా కొంగరకు ఇవ్వాల్సిన పారితోషికం రూ.15 కోట్లు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు అంటే జీఎస్టీ (GST) అదనం కాగా, మొత్తం బిల్లు రూ.17.70 కోట్లకు చేరింది. అయితే, ఇందులో డాన్ పిక్చర్స్ కేవలం రూ.9.31 కోట్లు మాత్రమే ఇచ్చి ఇంకా రూ.8.39 కోట్ల డబ్బుని ఇవ్వకుండా వదిలించుకునే ప్రయత్నం చేస్తుందని సుధా కొంగర తరపు లాయర్లు
నిత్యేష్ నటరాజ్, వైభవ్ వెంకటేష్ కోర్టు దగ్గర విన్నవించారు.ఇక చెప్పుకోవడానికి వంద కోట్లని తెగ డబ్బా కొట్టుకున్నారు.డైరెక్టర్ కి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడం పెద్ద కామెడీగా ఉందని సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.
also read:ఎన్టీఆర్ కొత్త సినిమా పోస్టర్‌పై చెలరేగుతున్న వివాదం… ఇంతకీ మురుగన్ పుట్టింది ఎక్కడ ?
అయితే ఈ బకాయిని ఇలాగే ఉంచి తమ తదుపరి చిత్రం ‘ఇదయమ్ మురళి’ని జూలై 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి ఇప్పటి నుండే ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తుంది డాన్ పిక్చర్స్.దీంతో ఆ సమయంలో కోర్టుకు ఎక్కి పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారనే అపవాదు రాకుండా ముందుగానే కోర్టుని అప్రోచ్ అయ్యాం అంటూ స్పష్టం చేస్తుంది లీగల్ టీమ్.
ఇప్పటికే ఓటీటీ రిలీజ్ అయిపోయింది కాబట్టి, ‘పరాశక్తి’ చిత్రానికి సంబంధించిన శ్యాటిలైట్ టెలికాస్ట్ మరియు రీ-రిలీజ్ హక్కులను జూలై 8 వరకు నిలిపివేయాలని ఆర్డర్ ఇచ్చింది కోర్ట్. మరో వైపు, జూలై 10న రిలీజ్ కానున్న ‘ఇదయమ్ మురళి’ని కూడా హోల్డ్‌లో పెట్టాలన్న సుధా కొంగర విజ్ఞప్తిపై జూలై 7 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ డాన్ పిక్చర్స్ కి నోటీస్ ఇచ్చింది.చూడాలి మరి కోర్ట్ మెట్లెక్కిన ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకోనుందో !